Homeఎంటర్టైన్మెంట్Vijay Trisha love story : విజయ్-త్రిషల ప్రేమకి 'విక్రమ్-జ్యోతిక'లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

Vijay Trisha love story : విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

Vijay Trisha love story : విజయ్, త్రిష.. ఇప్పుడు వీరిద్దరి గురించే దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది . తన అభిమానిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమె ద్వారా ఇద్దరు పిల్లలు కలిగినప్పటికీ.. విజయ్ త్రిష కు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. చివరికి తన భార్యను వదులుకొని త్రిషకు సరెండర్ అయిపోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న విజయ్.. తన భార్యను ఎందుకు వద్దనుకున్నాడు.. త్రిషతో అతడికి రిలేషన్ ఎలా మొదలైంది? అది చివరికి ఎలా బలపడింది.. సహజీవనం […]

Vijay Trisha love story : విజయ్, త్రిష.. ఇప్పుడు వీరిద్దరి గురించే దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది . తన అభిమానిని పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమె ద్వారా ఇద్దరు పిల్లలు కలిగినప్పటికీ.. విజయ్ త్రిష కు క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. చివరికి తన భార్యను వదులుకొని త్రిషకు సరెండర్ అయిపోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్న విజయ్.. తన భార్యను ఎందుకు వద్దనుకున్నాడు.. త్రిషతో అతడికి రిలేషన్ ఎలా మొదలైంది? అది చివరికి ఎలా బలపడింది.. సహజీవనం వరకు ఎలా దారితీసింది.. ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.

తెలుగులో మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని దర్శకుడు ధరణి అనుకున్నాడు. ముందుగా విక్రం హీరోగా.. జ్యోతిక హీరోయిన్గా పెట్టి ఈ సినిమా తీద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికి విక్రం డేట్స్ ఖాళీగా లేవు. జ్యోతికది అదే పరిస్థితి . ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో విజయ్, త్రిష ద్వారా ఈ సినిమాను రూపొందించాలని ధరణి అనుకున్నాడు. ధరణి విజయ్ ని అప్రోచ్ కావడం.. త్రిష కు కథ చెప్పడంతో.. వారిద్దరూ ఓకే అన్నారు. అలా గిల్లి సినిమా పట్టాలెక్కింది.

2004లో ఏప్రిల్ నెలలో గిల్లి సినిమా విడుదలైంది.. ఈ సినిమా విజయ్ కెరియర్ మొత్తాన్ని మరోవైపు తీసుకెళ్లింది. సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి వారు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. సూర్య, విక్రమ్ వంటి వారు సిల్వర్ స్క్రీన్ మీద అదరగొడుతున్నారు. కెరియర్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న విజయ్ కి గిల్లీ ఒక సంజీవని మాదిరిగా నిలిచింది.

గిల్లి సినిమాలో విజయ్ కబడ్డీ క్రీడాకారుడిగా నటించాడు. ప్రకాష్ రాజ్ ముత్తిపాండిగా.. అతడు ప్రేమించే యువతిగా త్రిష అద్భుతమైన హావభావాలు ప్రదర్శించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ” చెల్లం” అనే పేరుతో చెప్పే డైలాగ్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉందంటే మాములు విషయం కాదు. ఏ సినిమాలో “అప్పడి పోడు” పాట దేశవ్యాప్తంగా సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు..

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్, త్రిష మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని.. అది కాస్త ప్రేమకు దారి తీసిందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ తర్వాత వీరిద్దరూ తిరుపాచి, అతీ, కురువి వంటి సినిమాలలో నటించారు. ఇక ఇటీవల లియో అనే సినిమాలో వీరిద్దరూ నటించారు. వాస్తవానికి త్రిష కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. దానికి విజయ్ కారణమని తమిళ అభిమానులు చెబుతుంటారు . ఇప్పుడిక తమ బంధాన్ని బహిరంగంగానే విజయ్ వ్యక్తం చేశాడు. అంతేకాదు తన భార్యతో విడాకులు సెటిల్మెంట్ చేసుకోవడానికి ఏకంగా 250 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ విజయ్ త్రిష 2004లో గిల్లి సినిమా ద్వారా ఏ స్థాయిలో అయితే ప్రభంజనం సృష్టించారో.. 22 సంవత్సరాల తర్వాత కూడా అదే స్థాయిలో మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ ఉండడం గమనార్హం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper