Sivakarthikeyan Wife Aarthi: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న నటుడు శివ కార్తికేయన్… స్టార్ హీరోలైన విజయ్, సూర్య, ధనుష్ లాంటి నటులతో పాటు తను కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తను చేసే సినిమాల్లో వైవిధ్యం ఉంటుందని ప్రతి ఒక్కరి చేత అనిపించుకుంటున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇదిలా ఉంటే శివ కార్తికేయన్ తన భార్య ఆర్తి ఇద్దరు కలిసి పర్సనల్ లైఫ్ లో చాలా ఎంజాయ్ చేస్తుంటారు. సమయం దొరికిన ప్రతిసారి ఏదో వెకేషన్ కి వెళ్లి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తద్వారా వాళ్ల అభిమానులు కూడా ఆ ఫోటోలను చూసి ఆనంద పడుతూ ఉంటారు. ఈ రోజుల్లో భార్యాభర్తలు నాకు సమయాన్ని కేటాయించడం లేదు అంటూ గొడవలు పడుతున్న సందర్భంలో వాళ్లు మాత్రం ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక అందరు స్టాండింగ్ తో ఉంటూ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
తను కూడా సినిమా షూటింగు లేకపోతే ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. అందువల్లే వాళ్ళు ఇప్పటికీ చాలా అన్యోన్యంగా చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు…
ప్రస్తుతం వాళ్లు ఒక వెకేషన్ కి వెళ్లి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా శివ కార్తికేయన్ నటుడు గానే కాకుండా భర్తగా కూడా సక్సెస్ఫుల్గానే నిలుస్తున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది హీరోలు పెళ్లి చేసుకున్న సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో డివోర్స్ తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.
కానీ శివ కార్తికేయన్ మాత్రం సినిమాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో తన ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ రెండింటిని సమపాళ్లలో చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఇప్పటికీ సక్సెస్ఫుల్ హీరోగా సక్సెస్ఫుల్ భర్తగా నిలుస్తున్నాడు…