Gurgaon weather: అప్పటిదాకా ఎండ దంచి కొట్టింది. ఉన్నట్టుండి గాలి మొదలైంది. మేఘాలు ఏర్పడ్డాయి. దట్టంగా చీకటి మాదిరిగా అలముకున్నాయి. అంతే వర్షం మొదలైంది. నింగి నేల ఏకమయ్యే విధంగా వర్షం కురిసింది. ఈ వర్షం ఢిల్లీ.. నోయిడా.. గురుగ్రామ్.. ఘజియాబాద్ ప్రాంతాలను ముంచెత్తింది. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో ఢిల్లీ పరిసర ప్రాంత ప్రజలు ఉపశమనం పొందారు.
వర్షానికి గల కారణాలేంటి
అక్టోబర్ నెలలో సాధారణంగా ఈ ప్రాంతంలో వర్షాలు తగ్గు ముఖం పడతాయి. ఢిల్లీలో ఈ స్థాయిలో భారీ వర్షాలు ఎందుకు కురిశాయి.. దీని వెనుక ఉన్న కారణాలను వాతావరణ శాఖ అధికారులు బయటపెట్టారు. భారత వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం.. వాయవ్య భారత దేశంలో ఒకేసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందువల్లే వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఫసిపిక్ లో ఏర్పడిన ఎల్ నీనో.. ఇంకా అనేక రకాల అంశాలు కారణమని వెదర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. వాతావరణ వ్యవస్థలు ఒకేసారి చురుకుగా మారిపోయాయని.. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పశ్చిమ అలజడి
హర్యానా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం చోటుచేసుకుందని.. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో పశ్చిమ అలజడి కొనసాగుతోందని.. హిమాలయాల్లో ఏర్పడిన పరిస్థితుల ఇందుకు కారణమని తెలుస్తోంది . వాయువ్య రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ వైపు ద్రోణి విస్తరించిందని.. అందువల్లే వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల వాతావరణంలో తేమ పెరిగిందని.. గాలి కదలికలు విస్తృతంగా మారిపోయాయని.. అందువల్లే మేఘాలు వేగంగా అభివృద్ధి చెంది వర్షాలు కురిసాయని అధికారులు చెబుతున్నారు.
వాతావరణ శాఖ ముందుగానే..
ఈ మార్పును వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అక్టోబర్ 12న ఉరుములు మెరుపులు బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. కొన్ని ప్రాంతాలలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాకపోతే ఢిల్లీలో గంటకు 60 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీచాయి. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జండే వాలన్ ఆలయ సమీపంలో భారీగా వర్షం నీరు నిలిచింది. ఢిల్లీ తోపాటు ఎన్సీఆర్ పరిధిలోని ఇతర నగరాల్లో కూడా వర్షం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుత ఐఎండీ అధికారుల అంచనా ప్రకారం వచ్చే రోజుల్లో కూడా అనుకూలమైన వెదర్ కండీషన్స్ ఏర్పడితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటిదాకా ఢిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘవృతమై ఉంటుందని.. అధికారులు చెబుతున్నారు.. ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వరకు కురిసిన భారీ వర్షానికి స్పష్టంగా ఒకటే కారణం కాదు. కాకపోతే హిమాలయాలలో ఏర్పడుతున్న పరిస్థితులు వాయవ్య భారత దేశంలో వర్షాలకు కారణమవుతున్నాయి.
#WATCH | Delhi: Rain lashes parts of the National Capital.
Visuals from Jantar Mantar https://t.co/cexwSEGwKu
— ANI (@ANI) October 11, 2026