Satires on Rahul Gandhi: మన దేశానికి, క్రికెట్ కు విడదీయరాని అనుబంధం ఉంది. క్రికెట్ కనుక ఒక మతం అయితే మన దేశంలో అతిపెద్ద మతంగా ఉండేది. క్రికెట్ దినదిన ప్రవర్దమానంగా మనదేశంలో ఎదుగుతోంది. అందువల్లే క్రికెట్ అనేది మన నరనరంలో జీర్ణించుకు పోయింది. క్రికెట్ కు మరింత ఖ్యాతి తీసుకురావడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రయత్నాలు చేస్తోంది. ఆధునిక స్టేడియాలు.. అంతకుమించి సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేకాదు ప్రపంచ క్రికెట్ మీద బీసీసీఐ పెత్తనం సాగిస్తోంది. ఇంతటి స్థాయి ఉన్న మన దేశం ఆసియా కప్ సాధిస్తే.. రాజకీయాలకతీతంగా నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుపెడితే ఏపీ మంత్రి లోకేష్ వరకు అందరూ సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీకి ప్రధాన నాయకుడు ఇంతవరకు టీమిండియా కు శుభాకాంక్షలు తెలియజేయలేదు.
పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లు ఆసక్తికరంగా మారాయి. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలలో మాత్రమే ఆడతామని భారత్ స్పష్టం చేసింది. అంతేకాదు తటస్థ వేదిక మీద మాత్రమే ఆ దేశంతో తలపడతామని ప్రకటించింది.. ఇటువంటి పరిస్థితులున్న నేపథ్యంలో టీమిండియా పాకిస్తాన్ అంటే చాలు కట్టుదిట్టంగా ఆడుతోంది. ప్రస్తుత ఆసియా కప్ లో ఏకంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి.. విజేతగా నిలిచింది. అంతేకాదు ఆసియా కప్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. భారత్ ఈ స్థాయిలో విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియాలో ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఒక్క అభినందన కూడా వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అలా వ్యవహరించడాన్ని.. రాహుల్ గాంధీ నిశ్శబ్దంగా ఉండడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.
“దేశమంతా భారత జట్టు విజయాన్ని జరుపుకుంటున్నది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలు, మంత్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ మనదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక పోస్ట్ కూడా చేయలేదు. ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. రాహుల్ గాంధీ సైతం నిశ్శబ్దంగా ఉన్నారు. తన రాజకీయ అవసరాల కోసం లడక్ లో జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి క్రీడలకు రాజకీయాలకు సంబంధం లేదు కదా” అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. మరోవైపు ఇటీవల రాహుల్ గాంధీని ఉద్దేశించి షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచి నాయకుడు అంటూ కొనియాడారు. ఇదే విషయాన్ని నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.