spot_img
Homeక్రీడలుక్రికెట్‌RCB : ఐపీఎల్ కప్ కొట్టకపోయినప్పటికీ.. బెంగళూరు నగరంపై ఆర్సీబీకి ఎంత ఔదార్యమో.. వీడియో వైరల్..

RCB : ఐపీఎల్ కప్ కొట్టకపోయినప్పటికీ.. బెంగళూరు నగరంపై ఆర్సీబీకి ఎంత ఔదార్యమో.. వీడియో వైరల్..

RCB  : ఐపీఎల్ లో అత్యంత విలువైన జట్లలో బెంగళూరు ఒకటి. ముంబై, చెన్నై తర్వాత ఆ స్థాయిలో బ్రాండ్ వాల్యూ ఉన్నది బెంగళూరు జట్టుకే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా బెంగళూరు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ సాధించకపోయినప్పటికీ.. ఆ జట్టుపై అభిమానులకు ఎప్పటికప్పుడు భారీ అంచనాలు ఉంటాయి. ఇటీవలి ఐపిఎల్ లో బెంగళూరు జట్టు చివరి 8 మ్యాచ్లను గెలిచి సెమీస్ దాకా వెళ్ళింది. సెమీస్ లో ఓటమి పాలయినప్పటికీ అభిమానుల మనసులు గెలుచుకుంది. మూడుసార్లు ఫైనల్ వెళ్లినప్పటికీ బెంగళూరు జట్టు కప్ సాధించలేకపోయింది. ఫైనల్ వెళ్లడం.. ఒత్తిడి భరించలేక ఓడిపోవడం బెంగళూరు జట్టుకు పరిపాటిగా మారింది. ఇటీవలి ఐపిఎల్ సీజన్లో ఐపీఎల్ ఛాంపియన్ అనే ట్యాగ్ లైన్ ను బెంగళూరు జట్టు యాడ్ చేసుకుంది. అయితే కీలక దశలో ఆటగాళ్లు చేతులెత్తేయడంతో బెంగళూరు ట్రోఫీ దక్కించుకోలేకపోయింది. అయితే బెంగళూరు జట్టు ఐపిఎల్ ట్రోఫీ సాధించకపోయినప్పటికీ బెంగళూరు నగర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించింది. సేవా విభాగంలో బెంగళూరు జట్టు అతిపెద్ద సాహసాన్ని చేసింది…

నీటి కరువుతో అల్లాడిపోతున్న బెంగళూరులో..

బెంగళూరు నగరంలో ప్రస్తుతం నీటి కరువు తారాస్థాయికి చేరింది. ఇటీవల నీటి కరువు వల్ల బెంగళూరు నగరం వార్తల్లోకి ఎక్కింది. అయితే నైరుతి రుతుపవనాల వల్ల కాస్త వర్షాలు కురవడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ నీటి కరువు ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు బెంగళూరు నగరంలోని పలు చెరువులకు జీవం పోసింది. ఏకంగా జలకలను తీసుకొచ్చింది. చెరువుల పునరుద్ధరణకు తన వంతు నడుం బిగించింది. ఇప్పటివరకు బెంగళూరు యాజమాన్యం రెండు చెరువుల చిత్రాన్ని సమూలంగా మార్చింది. ఐపీఎల్ లో విజేతగా నిల్వక పోయినప్పటికీ.. కన్నడ అభిమానులు ప్రతిసారి బెంగళూరు జట్టుకు జేజేలు పలుకుతుంటారు.. అభిమానులు విపరీతమైన ఆదరణ చూపుతున్న నేపథ్యంలో.. వారికి ఏదైనా చేయాలని బెంగళూరు యాజమాన్యం నిర్ణయించుకుంది. 2011 నుంచి ఏదో ఒక రూపంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. ఈ క్రమంలో ఇండియా కేర్ అనే సంస్థతో చేతులు కలిపి చెరువులను పునరుద్ధరించింది. చెరువుల పరిరక్షణలో ఆ సంస్థకు తన వంతు సాయం చేసింది.. బెంగళూరు నగరంలోని ఇట్లగల్పుర, సడన్ హల్లి అనే చెరువులను బెంగళూరు జట్టు యాజమాన్యం బాగు చేసింది. ఆ తర్వాత నీళ్లను నింపి.. ఆ చెరువులను స్థానికులకు అప్పగించింది. కేవలం మాట తీరుతో మాత్రమే కాకుండా సమాజ హితమైన కార్యక్రమాలు చేపట్టి బెంగళూరు జట్టు అభిమానుల మనసును గెలుచుకుంది. ఈ క్రమంలో అభిమానులు బెంగళూరు జట్టు యాజమాన్యం సేవా నిరతిని పొగుడుతున్నారు. బెంగళూరు దయా గుణం ముందు ఏ జట్లూ సరి రావని కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు నగరం కోసం బెంగళూరు జట్టు యాజమాన్యం భగీరథ ప్రయత్నం చేసిందని సామాజిక మాధ్యమాల వేదికగా కొనియాడుతున్నారు నెటిజన్లు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper