Homeక్రీడలుSouth Africa vs Afghanistan Highlights: అప్ఘనిస్తాన్ ఓటమికి అతడే కారణం.. డైవ్ చేసి ఉంటే...

South Africa vs Afghanistan Highlights: అప్ఘనిస్తాన్ ఓటమికి అతడే కారణం.. డైవ్ చేసి ఉంటే కథ మారేది?

South Africa vs Afghanistan Highlights: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. విజయం రెండు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. చివరికి రెండు జట్ల పరుగులు సమం కావడంతో సూపర్ ఓవర్ దాక దారి తీసింది. సూపర్ ఓవర్ లో కూడా రెండు జట్ల స్కోర్ లు సమానం కావడంతో.. రెండవసారి సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్లో ముందుగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ […]

South Africa vs Afghanistan Highlights: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. విజయం రెండు జట్ల మధ్య దోబూచులాట ఆడింది. చివరికి రెండు జట్ల పరుగులు సమం కావడంతో సూపర్ ఓవర్ దాక దారి తీసింది. సూపర్ ఓవర్ లో కూడా రెండు జట్ల స్కోర్ లు సమానం కావడంతో.. రెండవసారి సూపర్ ఓవర్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మ్యాచ్లో ముందుగా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసింది. రికెల్టన్ 61, డికాక్ 59 రన్స్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు 187 పరుగులు చేసింది. ఓమర్ జాయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జట్టు చేజింగ్ ధాటిగా మొదలుపెట్టింది. గుర్బాజ్(84) బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఇబ్రహీం జద్రాన్ (12), నైబీ (0), అటల్(0), రసూలి (15), నబీ(5) విఫలం కావడంతో.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలుపు నుంచి ఓటమి దిశగా ప్రయాణం సాగించింది.

19 ఓవర్ వరకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు పరిస్థితి 175/9 గా ఉంది. చివరి ఓవర్ రబాడ వేశాడు. తొలి బంతి నో బాల్ అయింది. ఆ బంతిని గట్టిగా కొట్టడంతో నూర్ అహ్మద్ క్యాచ్ అవుట్ అయ్యాడు. నో బాల్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఫ్రీ హిట్ లభించింది. ఆ తదుపరి బంతిని రబాడ వైడ్ గా వేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు రెండు అదనపు పరుగులు వచ్చాయి.

ఈసారి రబాడ వేసిన బంతికి ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఒక్క పరుగు కూడా రాలేదు. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయ సమీకరణం ఐదు బంతులకు 11 పరుగులుగా మారిపోయింది.ఈ దశలో నూర్ అహ్మద్ రబాడ వేసిన బంతిని సిక్సర్ కొట్టాడు. దీంతో విజయ సమీకరణం నాలుగు బంతులకు ఐదు పరుగులుగా మారిపోయింది. మూడో బంతికి రబాడ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. నాలుగో బంతి నో బాల్ గా వెళ్ళింది. ఆఫ్గనిస్తాన్ జట్టు రెండు పరుగులు తీసింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయానికి మూడు బంతులకు రెండు పరుగులు కావాలి. అయితే ఆ తదుపరి బంతికి నూర్ అహ్మద్ ఔట్ అయ్యాడు.

వాస్తవానికి నూర్ అహ్మద్ కాస్త డైవ్ చేసి ఉంటే ఆఫ్గనిస్తాన్ జట్టుకు రెండు పరుగులు వచ్చేవి. తద్వారా విజయం సాధించేది. రెండవ పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో అతడు రన్ అవుట్ అయ్యాడు. తద్వారా రెండు జట్ల పరుగులు ఈక్వల్ అయ్యాయి. ఆ తర్వాత రెండుసార్లు సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. తొలి సూపర్ ఓవర్ లో రెండు జట్లు సమానంగా పరుగులు తీశాయి. రెండవ సూపర్ ఓవర్ లో మాత్రం ఆఫ్గనిస్తాన్ జట్టు ఒత్తిడికి గురి కావడంతో దక్షిణాఫ్రికా జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper