Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir mass warning: ట్రోల్ చేస్తున్న అభిమానులకు గౌతమ్ గంభీర్ మాస్ వార్నింగ్: వైరల్...

Gautam Gambhir mass warning: ట్రోల్ చేస్తున్న అభిమానులకు గౌతమ్ గంభీర్ మాస్ వార్నింగ్: వైరల్ వీడియో

Gautam Gambhir mass warning: అసలే ముక్కోపి. పైగా ఇటీవల టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా వెనుకబడిపోయింది. తాజాగా టి20 వరల్డ్ కప్ లో కీలకమైన సూపర్ 8 మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. భారీగా పరుగులు తేడాతో ఓటమిపాలు కావడంతో నెట్ రన్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళింది. దీంతో టీమిండియా ఆటగాళ్ల తీరు పట్ల.. అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ తీరును అభిమానులు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ […]

Gautam Gambhir mass warning: అసలే ముక్కోపి. పైగా ఇటీవల టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా వెనుకబడిపోయింది. తాజాగా టి20 వరల్డ్ కప్ లో కీలకమైన సూపర్ 8 మ్యాచ్ లో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. భారీగా పరుగులు తేడాతో ఓటమిపాలు కావడంతో నెట్ రన్ రేట్ నెగిటివ్లోకి వెళ్ళింది. దీంతో టీమిండియా ఆటగాళ్ల తీరు పట్ల.. అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ తీరును అభిమానులు తప్పుపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ అభిమానులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అభిమానులు తనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గౌతమ్ గంభీర్ హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలంలో టీమిండియా ఊహించని విధంగా ఓటములు పొందింది. న్యూజిలాండ్ చేతిలో వన్డే సిరీస్.. అంతకుముందు దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్.. ఇక ప్రస్తుతం దక్షిణాఫ్రికా చేతిలోనే టి20 వరల్డ్ కప్ లో ఓడిపోవడం.. వంటి పరిణామాలు అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. అందువల్లే వారు సోషల్ మీడియా వేదికగా గౌతమ్ గంభీర్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు.

కొన్ని సందర్భాల్లో అయితే గౌతమ్ గంభీర్ పేరు మీద సామాజిక మాధ్యమాలలో యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. తద్వారా గౌతమ్ గంభీర్ మీద మేనేజ్మెంట్ కంటే ఎక్కువగా అభిమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి గౌతమ్ గంభీర్ ది.

అభిమానులు తనపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఇటీవల పరుష పదజాలంతో మాట్లాడారు. తనను విమర్శిస్తున్న వారందరికీ గట్టిగా సమాధానం చెప్తానంటూ గౌతమ్ గంభీర్ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అయితే ఇదంతా ఇప్పటిది కాదని… గతంలోని జరిగిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ మీద విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వీడియో కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper