spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Kapu Politics: వైసీపీ 'కాపు' రాజకీయం.. రంగంలోకి ముద్రగడ!

YCP Kapu Politics: వైసీపీ ‘కాపు’ రాజకీయం.. రంగంలోకి ముద్రగడ!

YCP Kapu Politics: ఏపీలో కాపు రాజకీయం మరోసారి కాక రేపుతోంది. గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కూటమికి అండగా నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత కనిపించింది కాపుల్లో. అయితే తాజాగా అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్ నేపథ్యంలో.. కాపుల అంశాన్ని ప్రధానంగా లేవనెత్తుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం వ్యూహాత్మకంగా కాపు నేతలను రంగంలోకి దించింది. అంబటి రాంబాబు అరెస్టు మొదలు కాపు నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు.. బయటకు వస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వారి కామెంట్స్ కాపుల్లో ఎంతవరకు ప్రభావం చూపుతావో తెలియదు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపులను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తోంది అనేది స్పష్టమవుతోంది. అయితే ఈరోజు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. బయటకు వచ్చి టీడీపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు ముద్రగడ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఆది నుంచి అంతే..
ఆది నుంచి సీఎం చంద్రబాబు( CM Chandrababu) విషయంలో ముద్రగడ పద్మనాభం వ్యవహార శైలి అలానే ఉండేది. ఇప్పుడు కూడా అదే వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. రెండుసార్లు కాపుల సాయంతోనే చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నా కుటుంబాన్ని వేధించారు అంటూ చెప్పుకొచ్చారు. మాకు జరిగిన అవమానాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మేం బానిసలం కాదు.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస రాలేదు. అలా అంటూనే తిరుమల లడ్డు పై రోజు అబద్ధాలు ఆడుతున్నారు. నీ అబద్ధాలను ఆతీ క్షమాపణ చెప్పండి.. క్షమాపణ చెప్పకుంటే కనీసం మాట్లాడడం ఆపేయండి అంటూ సూచించారు. కాపుల అందరితోనే అధికారంలోకి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ప్రభుత్వంలో వారి ఇల్లు పైనే దాడులు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. పనిలో పనిగా అంబటి రాంబాబు కుమార్తె మౌనికను ప్రశంసించారు. మమతా బెనర్జీ లాంటి స్థాయికి ఎదుగుతారు అంటూ ఆశీర్వదించారు.

పవన్ ప్రస్తావన లేకుండా..
అయితే ఈసారి ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట అనలేదు. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దాటికి ముద్రగడ పద్మనాభం పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకున్నారు. కేవలం చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా కాపు సామాజిక వర్గంలో చీలిక తేవాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ ఆలోచనగా తేలిపోతోంది. 2014లో టిడిపి అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు ముద్రగడ. అది అంతిమంగా టిడిపికి నష్టం చేసింది. అయితే ఇప్పుడు కూడా ముద్రగడను జగన్మోహన్ రెడ్డి ప్రయోగించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే గతం మాదిరిగా ముద్రగడ కామెంట్స్ కాపుల్లో ప్రభావం చూపే పరిస్థితి ఎంత మాత్రం లేదు. టిడిపి హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం చేపట్టిన ముద్రగడ.. వైసిపి వచ్చిన వెంటనే మూసివేశారు. వైసిపి ఐదేళ్ల పాలనలో కాపుల గురించి ఏ పథకము లేకుండా పోయింది. పైగా అదేపనిగా పవన్ కళ్యాణ్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం పై మాట్లాడారు. కానీ ఆ సమయంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ముద్రగడ ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఇప్పుడు అంబటి రాంబాబు నడిరోడ్డుపై సీఎం చంద్రబాబుపై తిట్ల దండకం అందుకున్నారు. అటువంటి వ్యక్తిని సాకుగా చూపి కాపు రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న వినిపిస్తోంది. మొత్తానికి అయితే ముద్రగడ రంగంలోకి దిగడం విశేషం. మొన్ననే ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేస్తానని కూడా శపధం చేశారు. అందుకే ఇలా రంగంలోకి దిగారన్న సెటైర్లు ఆయనపై పడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper