England Tour Team India: 2027 లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని భారత జట్టు గట్టిగా భావిస్తోంది. ఇటీవల టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడం.. అంతకుముందు ఆసియా కప్ సాధించడం.. తాజాగా t20 వరల్డ్ కప్ గెలవడం.. ఇవన్నీ కూడా వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా స్థాయిని నిరూపించాయి.
టీమిండియా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ గెలిచింది. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే ట్రోఫీని అందుకుంది. అంతకుముందు ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో అందుకుంది. తద్వారా టీమిండియా గతంలో దక్షిణాఫ్రికా.. అంతకంటే ముందు ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ జట్లతో ఎదురైన దారుణమైన ఓటములకు లేపనం లాగా ఈ విజయాన్ని మార్చుకుంది. ఇక వైట్ బాల్ ఫార్మేట్ విషయంలో టీమిండియా తిరుగులేని స్థాయిలో దూసుకుపోతోంది. ఆసియా కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టి20 వరల్డ్ కప్.. విజయాలు టీమిండియా స్థాయిని నిరూపిస్తున్నాయి.
వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా జట్టు విషయంలో తీవ్రమైన కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ పూర్తి అయిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ టూర్ వెళ్తుంది. ఈ సిరీస్ వన్డే వరల్డ్ కప్ కు ముందు టీం ఇండియాకు అత్యంత ముఖ్యం.. హార్దిక్ పాండ్యా, బుమ్రా, విరాట్ కోహ్లీ జట్టులోకి రాబోతున్నారు. జూరెల్ బ్యాకప్ కీపర్ గా రేసులో ఉన్నాడు. జైస్వాల్ రిజర్వ్ ఓపెనర్ గా ఉండే అవకాశం ఉంది.. ఆల్ రౌండర్ స్థానం కోసం అక్షర్ పటేల్ పోటీ పడుతున్నాడు. అదనపు పేసర్ స్థానం కోసం యువ ఆటగాళ్ల మధ్య విపరీతంగా పోటీ ఉంది.
గిల్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. అయ్యర్.. రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ.. హార్దిక్ పాండ్యా.. కేఎల్ రాహుల్.. నితీష్ కుమార్ రెడ్డి.. కులదీప్ యాదవ్.. మహమ్మద్ సిరాజ్.. కిషన్.. వాషింగ్టన్ సుందర్.. బుమ్రా.. అర్ష్ దీప్ సింగ్.. హర్షిత్/ గుర్న్/ రానా/ ప్రిన్స్ యాదవ్/ యుద్వీర్ సింగ్ వంటి వారితో జట్టును ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
