Actress Aishwarya: స్టార్ మా ఛానల్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘అగ్ని పరీక్ష’ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన భర్త వినయ్ తో విడాకులు తీసుకున్నట్టు కాసేపటి క్రితమే అధికారికంగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది. జీ తెలుగు , మా టీవీ , ఈటీవీ లలో ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటించిన ఐశ్వర్య , తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా ఆమె పాల్గొన్నది. అయితే ఈమె 2019 వ సంవత్సరం లో మైసూర్ కి చెందిన వినయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం వరకు ఆమె సాఫీగానే తన దాంపత్య జీవితం కొనసాగింది కానీ , ఆ తర్వాత ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయారు అంటూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
అందుకు రకరకాల కారణాలతో కథనాలు ప్రచారం చేశారు. దీంతో స్వయంగా ఐశ్వర్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ఏడాది కాలంగా తామిద్దరం విడివిడిగానే ఉంటున్నామని , సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే, ఇరువురి కుటుంబ సభ్యులతో చర్చించి , పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, ఈ సమయం లో మా వ్యక్తిగత స్వేచ్చని , మా మానసిక ప్రశాంతతని గౌరవించాలని అభిమానులను ఐశ్వర్య కోరింది. అయితే తమ విడాకుల పట్ల నిజానిజాలు తెలియకుండా లైక్స్ కోసం , వ్యూస్ కోసం అసత్య ప్రచారాలను చెయ్యాలని అనుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం పై అభిమానులు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఐశ్వర్య , వినయ్ లు అనేక సందర్భాల్లో జంటగా టీవీ షోస్ లో కనిపించారు. వీళ్లిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత ని చూసి అందరూ మురిసిపోయారు. కానీ అకస్మాత్తుగా ఇలా విడిపోయారు అంటూ వార్తలు రావడం తో ఒక్కసారిగా కంగుతిన్నారు అభిమానులు. మరి ఐశ్వర్య భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటుందా లేదా సోలో గానే తన జీవితాన్ని కొనసాగిస్తుందా అనేది చూడాలి.