Homeక్రీడలుక్రికెట్‌Shahid Afridi: దురంధర్ ఎఫెక్ట్.. ఎవరితోనూ మాట్లాడలేకపోతున్న పాక్ క్రికెటర్!

Shahid Afridi: దురంధర్ ఎఫెక్ట్.. ఎవరితోనూ మాట్లాడలేకపోతున్న పాక్ క్రికెటర్!

Shahid Afridi: దురంధర్ సినిమా ఇండియాలో రికార్డులను సృష్టిస్తోంది. కొంతమంది ఉదారవాదులకు.. సో కాల్డ్ ప్రజాస్వామ్యవాదులకు చుక్కలు చూపిస్తోంది. రోజురోజుకు దురంధర్ మానియా పెరిగిపోతున్న నేపథ్యంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు మొత్తం బద్దలవుతున్నాయి. ఈ సినిమా లో రణవీర్ సింగ్ పరకాయ ప్రవేశం చేశాడు. నిజజీవితంలో గూడచారి ఎలా ఉంటాడో.. అచ్చం అలానే నటించి చూపించాడు. Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి? దురంధర్ […]

Shahid Afridi: దురంధర్ సినిమా ఇండియాలో రికార్డులను సృష్టిస్తోంది. కొంతమంది ఉదారవాదులకు.. సో కాల్డ్ ప్రజాస్వామ్యవాదులకు చుక్కలు చూపిస్తోంది. రోజురోజుకు దురంధర్ మానియా పెరిగిపోతున్న నేపథ్యంలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు మొత్తం బద్దలవుతున్నాయి. ఈ సినిమా లో రణవీర్ సింగ్ పరకాయ ప్రవేశం చేశాడు. నిజజీవితంలో గూడచారి ఎలా ఉంటాడో.. అచ్చం అలానే నటించి చూపించాడు.

Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?

దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంటే.. పాకిస్తాన్ లో అంతకు మించిన ఉపద్రవాలు నమోదు అవుతున్నాయి. పాకిస్తాన్ లో ఇప్పటికే ఈ సినిమా ప్రకంనలు సృష్టిస్తోంది. ఈ సినిమా అక్కడ విడుదలయ్యే అవకాశం లేదు. కాకపోతే చాలామంది ఇప్పటికే దురంధర్ పార్ట్ 1 ను నెట్ ఫ్లిక్స్ లో చూశారు. పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలను.. ఉగ్రవాదుల అకృత్యాలను తీవ్రంగా ఎండ కట్టారు. ఇండియాలో మాదిరిగానే పార్ట్ 2 విడుదల కోసం పాకిస్తాన్ ప్రజలు ఎదురుచూస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దురంధర్ 2 విడుదలైన తర్వాత.. ఉగ్రవాదుల అసలు ముఖాలను.. పాకిస్తాన్ పరిపాలకుల దుర్మార్గాన్ని బయటపెట్టిన తర్వాత.. అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశంలో ఉన్న ఇండియన్ ఏజెంట్ల గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్లో యాచకులు.. అనాధలు.. రోడ్డుమీద పడి ఉండే వారిని పదేపదే విచారిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి. “పాకిస్తాన్ దేశంలో దురంధర్ సినిమా సంచలనం సృష్టిస్తోంది. ప్రకంపనలు కలిగిస్తోంది. అక్కడ చాలామందిని విచారిస్తోంది. ఎవరు ఇండియన్ ఏజెంట్లో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దురంధర్ సినిమా విడుదల తర్వాత పాకిస్తాన్లో ఎవరినీ నమ్మలేమని.. ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది వాపోయాడు. ఎవరితో మాట్లాడినా కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. “ఎందుకంటే వారు భారత ఏజెంట్లు అయి ఉండవచ్చని అనిపిస్తోంది. వారు భారత ఏజెంట్లు అవునోకాదో తెలుసుకోవడానికి మన ప్రభుత్వం రోడ్డు పక్కన బిచ్చగాళ్ళ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిగా విచారిస్తోంది. ఆ సినిమా వల్ల ఎన్నో రకాలుగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఏజెంట్ల గురించి ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తోందని” అఫ్రిది పేర్కొన్నాడు.

అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది.. భారత నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ” ఇదీ నయా భారత్ అంటే.. ఒక్క సినిమాకే ఇంతలా వణికిపోతుంటే.. ఇండియన్ ఏజెన్సీలు రంగంలోకి దిగితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని కట్టిపెట్టి. జాగ్రత్తగా ఉంటే.. భారత్ పాకిస్తాన్ కు అండగా ఉంటుందని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper