Homeక్రీడలుక్రికెట్‌David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైదానంలో ఆట మాత్రమే కాదు.. మైదానం వెలుపల ప్రవర్తన కూడా అద్భుతంగా ఉండాలి. అలాకాకుండా సెలబ్రిటీ హోదా ఉంది.. తాగుతాం.. చిందేస్తాం.. దూకేస్తాం అంటే కుదరదు. పాపం ఈ క్రికెటర్ పరిస్థితి కూడా అలానే […]

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైదానంలో ఆట మాత్రమే కాదు.. మైదానం వెలుపల ప్రవర్తన కూడా అద్భుతంగా ఉండాలి. అలాకాకుండా సెలబ్రిటీ హోదా ఉంది.. తాగుతాం.. చిందేస్తాం.. దూకేస్తాం అంటే కుదరదు. పాపం ఈ క్రికెటర్ పరిస్థితి కూడా అలానే అయిపోయింది.

డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో విధ్వంసకరమైన ఆటగాడు. ఐపీఎల్ లో హైదరాబాద్ అభిమానులకు కూడా సుపరిచితుడు. ఎందుకంటే ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు ఇతడు నాయకుడిగా వ్యవహరించాడు. హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు. మైదానంలో ఎంత దూకుడుగా అయితే ఉంటాడో.. మైదానం వెలుపల కూడా అదే స్థాయిలో ప్రవర్తన కొనసాగిస్తూ ఉంటాడు. అందువల్లే ఇతడు నిత్యం వార్తల్లో ఉంటూ ఉంటాడు. తాజాగా ఇతడు చేసిన వ్యవహారం పెంటపెంట అయింది. చివరికి జైలు శిక్ష ఎదురుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది ఏప్రిల్ నెల ఐదున సిడ్నీలో బీభత్సంగా తాగాడు. తాగిన మత్తులో డ్రైవింగ్ చేశాడు. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాడు. ఫలితంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. జైలు శిక్ష.. అపరాధ రుసుము ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో.. ఇతడి తరఫు న్యాయవాది కోర్టు దాకా వెళ్లారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. అయితే తాగి వాహనం నడపడం తప్పు కాబట్టి న్యాయస్థానం కూడా తీవ్రంగా పరిగణించింది. ఆయనకు ఏకంగా 9 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు డ్రైవింగ్ నిషేధం.. 2200 ఆస్ట్రేలియా డాలర్లు చెల్లించాల్సి ఉంది. మద్యం తాగిన తర్వాత కూడా తాను డ్రైవింగ్ చేయడం తప్పు అని వార్నర్ ఒప్పుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆగస్టు 18 నుంచి వార్నర్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సెలబ్రిటీలు తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి. తమ హుందాతనాన్ని కాపాడుకోవాలి. అలాకాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయి. మనదేశంలో అంటే చెల్లుబాటు అవుతుంది కానీ.. విదేశాలలో సాధ్యం కాదు. పైగా అక్కడ సెలబ్రిటీలను సాధారణ ప్రజల మాదిరిగానే చూస్తుంటారు. వార్నర్ వ్యవహారం చాలామంది క్రికెటర్లకు ఒక గుణపాఠం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper