Homeఎంటర్టైన్మెంట్David Warner: 'ఇరుముడి' పాటకు చిందులేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్!

David Warner: ‘ఇరుముడి’ పాటకు చిందులేసిన క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్!

David Warner: విదేశాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ కూడా , ఇండియా లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. ఎందుకంటే ఈయన ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీం కి కెప్టెన్ గా వ్యవహరించి , ఒక IPL ట్రోఫీ ని అందించాడు కాబట్టి. అంతే కాకుండా ఈయనకు మన తెలుగు సినిమాలన్నా, మన తెలుగు హీరోలు అన్నా చాలా […]

David Warner: విదేశాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయం అక్కర్లేని పేరు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ కూడా , ఇండియా లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు. ఎందుకంటే ఈయన ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ టీం కి కెప్టెన్ గా వ్యవహరించి , ఒక IPL ట్రోఫీ ని అందించాడు కాబట్టి. అంతే కాకుండా ఈయనకు మన తెలుగు సినిమాలన్నా, మన తెలుగు హీరోలు అన్నా చాలా ఇష్టం. ఏ సినిమా హిట్ అయినా వెంటనే ఆ గెటప్ లో దర్శనమిస్తూ రీల్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. గత ఏడాది ఈయన నితిన్ హీరో గా నటించిన ‘రాబిన్ హుడ్’ చిత్రం లో కీలక పాత్ర పోషించాడు. అంతే కాకుండా ఫోన్ పే యాడ్ లో ఈయన రాజమౌళి తో కలిసి చేసిన సందడి మామూలుది కాదు.

ఇకపోతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘ఇరుముడి’ మానియా ఏ రేంజ్ లో నడుస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా , ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ముక్క దొరకడం చాలా కష్టంగా తయారైంది పరిస్థితి. ఆ సినిమా మేనియా ఈ స్థాయిలో నడుస్తుండడం తో , డేవిడ్ వార్నర్ ‘ఇరుముడి’ లోని రవితేజ గెటప్ లో కొన్ని ఫోటోలు దిగి అప్లోడ్ చేసాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పర దేశానికీ చెందిన వాడు అయినప్పటికీ , తన మతానికి సంబంధించిన దేవుడు కాకపోయినప్పటికీ , ఎలాంటి భేదభావం లేకుండా, డేవిడ్ వార్నర్ అయ్యప్ప మాలలో కనిపించడం , నిజంగా చాలా గొప్ప విషయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇరుముడి బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ విషయానికి వస్తే, ఈ చిత్రానికి నేడు కూడా అన్ని ప్రాంతాల్లోనూ కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సంక్రాంతి సీజన్ లో మాత్రమే ఇలాంటివి మనం చూస్తుంటాము. అలాంటిది ఈ చిత్రానికి మామూలు వర్కింగ్ డేస్ లో కూడా సునామీ రేంజ్ ని తలపిస్తున్నాయి వసూళ్లు. నేడు కూడా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని బల్ల గుద్ది మరీ చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఈ బాక్స్ ఆఫీస్ సునామీ లో రాబోయే రోజుల్లో ఎన్ని రికార్డ్స్ కొట్టుకుపోతాయి అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper