Mohsin Naqvi apologize: భారత క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ పరపతి తెలియక.. సామర్థ్యం అర్థం కాక నిన్నటిదాకా ఎసిసి చైర్మన్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. తెర వెనుక పాకిస్తాన్ ప్లేయర్లకు సహాయం చేశాడు. అంతేకాదు భారత విజయాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేస్తే దానికి కూడా వక్ర భాష్యం చెప్పాడు నఖ్వీ. పైగా పిచ్చిపిచ్చి కూతలు కూశాడు. అంతర్జాతీయంగా ఒత్తిడి రావడం.. క్రికెట్ సమాజం విమర్శించడంతో నఖ్వీ అన్ని మూసుకోవాల్సి వచ్చింది. చివరికి బ్బాబ్బాబూ అంటూ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఇటీవల టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఉత్కంఠ గా సాగిన మ్యాచులు అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేసి అదరగొట్టింది. తద్వారా ఆసియా కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆసియా కప్ సాధించినప్పటికీ ఎసిసి చైర్మన్ నఖ్వీ వ్యవహార శైలి నచ్చక.. పైగా అతడు ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్టు ఇవ్వడంతో టీమిండియా కు నచ్చలేదు. దీంతో అతడి చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించలేదు. దీంతో అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకుండానే టీమ్ ఇండియా ప్లేయర్లు విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. టీ మీడియా ప్లేయర్లకు ట్రోఫీ ఇవ్వడానికి నఖ్వీ పోడియం వద్దకు వచ్చినప్పటికీ.. టీమిండియా ప్లేయర్లు అంతగా పట్టించుకోలేదు. అతడు వెళ్లిన తర్వాత విజయాన్ని వేడుకలాగా జరుపుకున్నారు.
ఈ వ్యవహారాన్ని నఖ్వీ తీవ్రంగా తప్పుపట్టాడు. సోషల్ మీడియా వేదికగా తన అక్కసు మొత్తాన్ని వెళ్ళగక్కాడు. దీంతో బిసిసిఐ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కింది. దీంతో ఎసిసి చైర్మన్ కు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. తట్టుకోలేక భారత క్రికెట్ మేనేజ్మెంట్ కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే ట్రోఫీ తిరిగిచ్చే విషయంలో మాత్రం నఖ్వీ మొండిగా వాదిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సూర్య కుమార్ యాదవ్ ఏసీసీ కార్యాలయానికి వస్తేనే ట్రోఫీ ఇస్తానని అతడు చెప్పడం పట్ల టీమిండి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నఖ్వీ క్షమాపణలు చెప్పడంతో టీమిండి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాతో పెట్టుకున్న ఎవరికైనా సరే ఇలాంటి అనుభవం ఎదురవుతుందని స్పష్టం చేస్తున్నారు.. నఖ్వీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని.. టీ మీడియా విషయంలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంటున్నారు.