Dhanashree Verma vs Chahal: కూరిమి ఉన్న దినములలో నేరములు కనిపించవు. అ కూరిమి విరిగిపోతే నేరములే కనిపిస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది నూటికి నూరు శాతం నిజం. ఎందుకంటే ప్రేమగా ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఫెవికాల్ లాగా అతుక్కుని తిరుగుతుంటారు. ఒకసారి విభేదాలు మొదలైతే ఎవరికి వారుగా విడిపోతారు. పైగా విమర్శలు చేసుకుంటారు. ఈ జాబితాలో టీమిండియా స్పిన్ బౌలర్ చాహల్, అతడి మాజీ భార్య ధనశ్రీ ముందు వరసలో ఉంటారు.
చాహల్, ధనశ్రీకి గతంలోనే వివాహం జరిగింది. మొదట్లో వీరిద్దరూ బాగానే ఉండేవారు. చాహల్ ఆడే మ్యాచ్ లకు ధన శ్రీ హాజరయ్యేది. అతడిని ఎంకరేజ్ చేసేది. ధనశ్రీ స్వతహాగానే కొరియోగ్రాఫర్ కావడంతో.. చాహల్ కూడా రియాల్టీ షోలకు ధనశ్రీ తో కలిసి హాజరయ్యేవాడు. అప్పుడప్పుడు ధనశ్రీ తో కలిసి స్టెప్పులు కూడా వేసేవాడు. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి అనుబంధంలో ఒక్కసారిగా విభేదాలు మొదలయ్యాయి. అవి అంతకంతకు పెరిగిపోవడంతో విడాకులకు దారి తీశాయి.
ఇటీవల ముంబైలోని ఓ కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ ఆర్జే మహ్వేష్ తో తిరగడం మొదలుపెట్టాడు. ఆ మధ్య టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు ఆమెతో కలిసి దుబాయ్ వెళ్లిపోయాడు. టీమిండియా ఆడిన మ్యాచ్ ను ఆమెతో కలిసి వీక్షించాడు.. దీంతో వారిద్దరి మధ్య బంధం గట్టి పడిందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని చాహల్ ప్రకటించకపోయినప్పటికీ..మహ్వేష్ సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా ప్రకటించింది.
విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ తన భార్య గురించి ఎటువంటి మాటలు మాట్లాడలేదు.. కానీ ధనశ్రీ మాత్రం అవకాశం దొరికితే చాలు చాహల్ మీద ఆరోపణలు చేస్తోంది.. పెళ్లైన రెండవ నెలలోనే చాహల్ తనకు అడ్డంగా దొరికిపోయాడని ధనశ్రీ ఆరోపించింది. రైస్ అండ్ ఫాల్ అనే హిందీ రియాల్టీ షోలో ఆమె తన హౌస్ మేట్స్ తో ఈ విషయాన్ని పంచుకుంది. భరణం విషయంలోనూ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని.. రకరకాల వేధింపులకు గురి చేశాడని ధనశ్రీ ఆరోపించింది. తమ పరస్పరం అంగీకరించడంతోనే విడాకుల ప్రక్రియ కూడా త్వరగా పూర్తయిందని ధనశ్రీ చెప్పింది. ఇక ఇటీవల కూడా చాహల్ పై ధనశ్రీ విమర్శలు చేసింది.
చాహల్, ధన శ్రీ విడాకులు తీసుకోవడానికి ఓ టీం ఇండియా క్రికెటర్ కారణమని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. చాహల్ తో విడాకులు తీసుకున్న తర్వాత అతడు ఆమెతో సన్నిహితంగా ఉంటున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత అవన్నీ కూడా నిరాధారమని.. ఉబుసు పోని కబుర్లని తేలింది. మొత్తానికి చాహల్ విడాకుల వ్యవహారంలో మూడో వ్యక్తి పాత్ర లేదని స్పష్టమైంది.
View this post on Instagram