Homeక్రీడలుక్రికెట్‌India Vs USA: సూర్య కుమార్ యాదవ్.. నీ బ్యాటింగ్ "స్కై" ఈస్ ది లిమిట్!

India Vs USA: సూర్య కుమార్ యాదవ్.. నీ బ్యాటింగ్ “స్కై” ఈస్ ది లిమిట్!

India Vs USA: బిజినెస్ మాన్ సినిమా చూశారా.. అందులో మహేష్ బాబు ఓ డైలాగ్ అంటాడు.. చుట్టూ రౌండ్అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్ లో నేను ఎక్కువ కొట్టేస్తాను అని.. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాదవ్ బిజినెస్ మాన్ సినిమాలోని మహేష్ బాబు డైలాగు ను గుర్తు చేశాడు. ఆ డైలాగ్ మాదిరిగానే […]

India Vs USA: బిజినెస్ మాన్ సినిమా చూశారా.. అందులో మహేష్ బాబు ఓ డైలాగ్ అంటాడు.. చుట్టూ రౌండ్అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్ లో నేను ఎక్కువ కొట్టేస్తాను అని.. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సూర్య భాయ్ అలియాస్ సూర్య కుమార్ యాదవ్ బిజినెస్ మాన్ సినిమాలోని మహేష్ బాబు డైలాగు ను గుర్తు చేశాడు. ఆ డైలాగ్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు.

ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. కీలకమైన ఆటగాళ్లు అవుట్ అవుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. పట్టు వదలని విక్రమార్కుడి లాగా బ్యాటింగ్ చేశాడు. సహనంతో ఆడాడు. కోపంతో ఆడాడు. కసితో ఆడాడు. మొత్తంగా తన బ్యాటింగ్లో అన్ని కోణాలను చూపించాడు. తద్వారా సూర్య కుమార్ యాదవ్ “మిస్టర్ 360” అనే బిరుదుకు జస్టిఫై చేశాడు. తద్వారా టీమిండియా 118/7 నుంచి 161/10 కు చేరుకుంది.

చివరి రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 19 ఓవర్లో 12 పరుగులు సాధించిన అతడు.. 20 ఓవర్లో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. ముఖ్యంగా 20 ఓవర్లో వరుసగా 4, 6,6,4 తన స్టామినా ఏమిటో నిరూపించాడు. ఫలితంగా భారత్ ఏకంగా 161 పరుగుల స్కోర్ వరకు వెళ్లిపోయింది. అన్నట్టు ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ 84 పరుగులు చేశాడు. 49 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో సత్తా చూపించాడు.. టీమిండియా 161 పరుగులు చేస్తే.. అందులో సూర్యకుమార్ యాదవ్ చేసినవే 84 పరుగులు ఉన్నాయంటే.. అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సూర్య కుమార్ యాదవ్ బీభత్సంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో మైదానం మొత్తం అతని నామస్మరణతో ఊగిపోయింది.. సూర్య సూర్య అంటూ అభిమానులు నినాదాలు చేయడంతో మైదానం మొత్తం దద్దరిల్లిపోయింది. ఒక ఆటగాడికి ఈ స్థాయిలో గౌరవం లభించడం.. అభిమానులు ఈ రేంజ్ లో అతడి నామస్మరణ చేయడం గొప్పగా ఉంది. ఇటీవల కాలంలో ఒక ఆటగాడికి ఈ స్థాయిలో ప్రేక్షకులు గౌరవం ఇవ్వలేదు. సూర్య భాయ్ అంటూ అభిమానులు చేసిన సందడి ఉర్రూతలూగించింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper