Homeక్రీడలుక్రికెట్‌SRH vs RCB IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ ను సన్ రైజర్స్ అడ్డుకుంటుందా? బలబలాలేమిటి?

SRH vs RCB IPL 2026: డిఫెండింగ్ ఛాంపియన్ ను సన్ రైజర్స్ అడ్డుకుంటుందా? బలబలాలేమిటి?

SRH vs RCB IPL 2026: ఎన్నిరోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానే వచ్చింది. శనివారం నుంచి ఐపీఎల్ మొదలు కాబోతోంది. ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రారంభ మ్యాచ్ కు సంబంధించి నిర్వాహక కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. గత ఏడాది ట్రోపీ గెలిచి బెంగళూరు భీకరమైన ఫామ్ లో ఉంది. గత ఏడాది హైదరాబాద్ […]

SRH vs RCB IPL 2026: ఎన్నిరోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానే వచ్చింది. శనివారం నుంచి ఐపీఎల్ మొదలు కాబోతోంది. ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రారంభ మ్యాచ్ కు సంబంధించి నిర్వాహక కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

గత ఏడాది ట్రోపీ గెలిచి బెంగళూరు భీకరమైన ఫామ్ లో ఉంది. గత ఏడాది హైదరాబాద్ ఆశించినస్థాయిలో ఆడలేదు. ఈక్రమంలో ఈరెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగే అంచనాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ నాయకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ సారథ్యం వహిస్తున్నాడు. కిషన్ కు తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో అతడుజట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం.

బెంగళూరు, హైదరాబాద్ లో భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. ప్లాట్ మైదానంకావడంతో పరుగుల వరదపారడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. డ్యూ ఉన్నప్పటికీ బౌలర్లు సత్తా చూపిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ లభిస్తుంది. బెంగళూరు, హైదరాబాద్ ఇప్పటి వరకూ 25 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో హైదరాబాద్ 13, బెంగళూరు 11 మ్యాచ్ లలో విజయం సాధించాయి.

2024 సీజన్ లో బెంగళూరు మీద హైదరాబాద్ జట్టు287 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్ర లో ఓ జట్టు సాధించిన అత్యధికస్కోరుగా ఇది కొనసాగుతోంది. హైదరాబాద్ సాధించిన ఈ రికార్డును మరే జట్టూ ఇంతవరకూ సాధించలేకపోవడం గమనార్హం. రెండు జట్లలో భీకరమైన ప్లేయర్లు ఉన్నారు.

Also Read: ఐపీఎల్ కు ముందు విరాట్ ను ఆవహించిన శివుడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పరిణామం

బెంగళూరులో విరాట్, రజత్ పాటిదార్, బెతల్, దయాళ్, సాల్ట్, జితేష్ శర్మ, కాక్స్ వంటివారితో బ్యాటింగ్ దళం బలంగా కనిపిస్తోంది. టిమ్ డేవిడ్, క్రునాల్ పాండ్యా, షెపర్డ్, వెంకటేష్ అయ్యర్, మంగేష్ వంటి వారు ఆల్ రౌండర్ పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నారు.

హేజిల్ వుడ్ ఎంట్రీ పై క్లారిటీ లేకపోవడంతో బౌలింగ్ వీక్ గా కనిపిస్తోంది. హేజిల్ వుడ్, రసిఖ్ ధార్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ శర్మ, తుషార, అభినందన్ సింగ్, డఫీ, యష్ దయాళ్ వంటి బౌలింగ్ విభాగంలో కీలకంగా ఉన్నప్పటికీ వీరిలో ఎవరికి అవకాశం లభిస్తుందో చూడాలి.

హైదరాబాద్ లో ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, హెడ్, అభిషేక్ శర్మ, సలీల్అరోరా, క్లాసెన్ కీలక బ్యాటర్లుగా ఉన్నారు.

హర్షల్ పటేల్, కామిందు మెండిస్, హర్ష్ దుబే, బ్రెడన్ కార్స్, శివాంగ్ కుమార్, క్రెయిన్స్ పులేత్రా, లియామ్ లివింగ్ స్టోన్, డేవిడ్ పేన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు ఆల్ రౌండర్లుగా ఉన్నారు.

కమిన్స్ జట్టులోకి వచ్చినప్పటికీ ఆడేది అనుమానమే. జీషబ్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, ఇసాన్ మలింగ, హుస్సేన్, ఓంకార్ తుర్మలే, అమిత్ కుమార్, ప్రపుల్ హింజ్, శివంమావి కీలక బౌలర్లుగా ఉన్నారు. వీరిలో శివం మావి, మలింగ, జయదేవ్ కు తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper