Homeఎంటర్టైన్మెంట్Peddi movie postponed reasons: 'ధురంధర్ 2 ' మేకర్స్ చేతుల్లోకి 'పెద్ది'..కానీ సినిమా వాయిదా...

Peddi movie postponed reasons: ‘ధురంధర్ 2 ‘ మేకర్స్ చేతుల్లోకి ‘పెద్ది’..కానీ సినిమా వాయిదా దాదాపుగా ఖరారు అయ్యినట్టే..

Peddi movie postponed reasons: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi Movie) చిత్రం పై అంచనాలు రోజుకు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా అది విస్ఫోటనం లాగా వెళుతోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా నుండి ఇలాంటివే వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లోనే పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క […]

Peddi movie postponed reasons: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది’ (Peddi Movie) చిత్రం పై అంచనాలు రోజుకు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా అది విస్ఫోటనం లాగా వెళుతోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా నుండి ఇలాంటివే వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లోనే పెద్దలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అని. అదే విధంగా ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పడానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కంటెంట్ ని చూసిన తర్వాత, ‘ధురంధర్ 2 ‘ మేకర్స్ కి కూడా ఈ సినిమాని నార్త్ ఇండియా లో డిస్ట్రిబ్యూట్ చెయ్యాలనే కోరిక కలిగింది.

‘ధురంధర్ 2’ చిత్రాన్ని నిర్మించిన వారిలో జియో స్టూడియోస్ సంస్థ భాగస్వామ్యం చాలా పెద్దది అనే విషయం మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే ఈ సంస్థ కు సంబంధించిన పెద్దలు ‘పెద్ది’ మూవీ రషస్ ని చూశారట. వాళ్లకు అవి అద్భుతంగా నచ్చిందని , ముఖ్యంగా రామ్ చరణ్ నట విశ్వరూపం వేరే లెవెల్ లో ఉందని, నార్త్ ఇండియన్స్ ఈ సినిమాని చూసి మెంటలెక్కిపోతారు అనే రేంజ్ ప్రశంసలతో మేకర్స్ ని ముంచి ఎత్తడమే కాకుండా, ఈ చిత్రాన్ని స్వయంగా తామే నార్త్ ఇండియా లో డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పారట. వాస్తవానికి ఈ సినిమా ‘ధురంధర్ 2’ తో పోటీ పడాల్సి ఉంది. కానీ జియో స్టూడియోస్ తో కుదిరించుకున్న ఈ ఒప్పందం కారణంగానే ఈ సినిమా ని ఏప్రిల్ 30 కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన పనులు రీ రికార్డింగ్, డబ్బింగ్ తో సహా పూర్తి అయ్యింది.

Also Read: ‘పెద్ది’ రాజ్ తరుణ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా ..? పూర్తి వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు..

ఇక మిగిలింది కేవలం సెకండ్ హాఫ్ కి సంబంధించిన పనులు మాత్రమే. ప్రస్తుతానికి క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు, రేపు లేదా ఎల్లుండి తో ఈ సినిమా షూటింగ్ ఒక ఐటెం సాంగ్ మినహా మొత్తం పూర్తి అయ్యినట్టే. ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే మృణాల్ ఠాకూర్ డేట్స్ తీసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా వాయిదా పడడం దాదాపుగా ఖరారు అయ్యినట్టే అని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయానికి అయ్యేలా లేదని , కచ్చితంగా ఆలస్యం అవుతుందని, కాబట్టి జూన్ 25 కి ఈ చిత్రాన్ని వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. అందుకే ఈరోజు మొదలు కావాల్సిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా ఏప్రిల్ 8 కి వాయిదా వేశారు. అంటే అప్పటి లోపు పెద్ది కొత్త విడుదల తేదీ ని ఫిక్స్ చేయబోతున్నారు అన్నమాట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper