Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli new tattoo viral: ఐపీఎల్ కు ముందు విరాట్ ను ఆవహించిన శివుడు.....

Virat Kohli new tattoo viral: ఐపీఎల్ కు ముందు విరాట్ ను ఆవహించిన శివుడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పరిణామం

Virat Kohli new tattoo viral: మాములుగానే విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్ లో ఉంటాడు. మైదానంలో అయితే ఎలా ఉంటాడో.. మైదానం వెలుపల కూడా బీస్ట్ మోడ్ లో కనిపిస్తుంటాడు. అందుకే విరాట్ కు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు విరాట్ పేరు వినిపిస్తే చాలు పునకాలు లోడింగ్ అన్నట్టుగా ఫ్యాన్స్ ఊగిపోతారు. విరాట్ ఏం చేసినా సంచలనం కావడానికి ప్రధాన కారణం అతడి మేనేరిజమే. టీమిండియాలో […]

Virat Kohli new tattoo viral: మాములుగానే విరాట్ కోహ్లీ ఫుల్ స్వింగ్ లో ఉంటాడు. మైదానంలో అయితే ఎలా ఉంటాడో.. మైదానం వెలుపల కూడా బీస్ట్ మోడ్ లో కనిపిస్తుంటాడు. అందుకే విరాట్ కు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు విరాట్ పేరు వినిపిస్తే చాలు పునకాలు లోడింగ్ అన్నట్టుగా ఫ్యాన్స్ ఊగిపోతారు.

విరాట్ ఏం చేసినా సంచలనం కావడానికి ప్రధాన కారణం అతడి మేనేరిజమే. టీమిండియాలో ఓ ఆడగాడి ని ఈస్థాయిలో అభిమానులు ప్రేమించడం, ఆారాధించడం మాములువిషయం కాదు. అది మొత్తం విరాట్ కోహ్లీకే చెందింది. విరాట్ బ్యాటింగ్ లో దుమ్ము రేపుతాడు. ఫీల్డింగ్ గురించి, వ్యూహాలు రచించడం గురించి.. వాటిని అమలుచేసే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

విరాట్ కు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని ముందుగానే చెప్పుకున్నా కదా.. విరాట్ ఏం చేసినా సంచలనం కావడానికి అదే ప్రధాన కారణం. విరాట్ స్టైల్ ఫాలోకాడు. స్టైల్ సెట్ చేస్తాడు. గతంలో మాన్ స్టర్ లాగా కనిపించే విరాట్ ఇప్పుడు మిస్టర్ బుద్ధిమంతుడిలాగా దర్శనమిస్తున్నాడు. దైవభక్తిని పెంచుకున్నాడు. ఆలయాలను సందర్శిస్తున్నాడు. పూజలలో పాల్గొంటున్నాడు. ఇటీవల అతడు తన చేతికి ఉన్న పాత టాటూలను మొత్తం తొలగించుకున్నాడు.

కొత్తగాఫుల్ స్టీవ్ ఆర్ట్ వేయించుకున్నాడు. ఇందులో శివుడికి సంబంధించిన విషయాలున్నాయి. మండల ప్యాటర్న్స్ కొత్తగా కనిపిస్తున్నాయి. అవన్నీ జీవితంలో పట్టుదల, ఏకాగ్రతకు నిదర్శనమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.విరాట్ వేయించుకున్నటాటూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విరాట్ ను శివుడు ఆవహించాడని.. అందుకే ఇలా టాటూ రూపొందించుకున్నాడని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.

శివుడు అంటేనే నిర్వికారుడు. కోపం వస్తే ప్రళయాన్ని పరిచయం చేస్తాడు. మూడో కన్నుతెరిచి ముప్పును తెప్పిస్తాడు. విరాట్ కూడా అంతే కదా.. తనను ప్రసన్నం చేసుకునే ఆటగాళ్లకు బ్యాట్ లు, జెర్సీలు ఇస్తాడు. సూచనలు కూడా చేస్తాడు. తేడా వస్తే చుక్కలు చూపిస్తాడు. అందుకే విరాట్ ను శివుడు ఆవహించాడని నెటిజన్లు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper