Homeక్రీడలుక్రికెట్‌Jacob Bethell super century: బెతల్ సూపర్ సెంచరీ.. అతడి తండ్రి ఏం చేశాడో తెలుసా?

Jacob Bethell super century: బెతల్ సూపర్ సెంచరీ.. అతడి తండ్రి ఏం చేశాడో తెలుసా?

Jacob Bethell super century: టీమిండియా 253 పరుగులు చేసింది. ఐసీసీ నిర్వహించే నాకౌట్ టోర్నీలో ఈ స్కోర్ చాలా పెద్దది. ముఖ్యంగా టి20 ఫార్మేట్ లో అత్యంత కష్టమైనది. ఇంతటి స్కోర్ ను చేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు త్వరగానే 4 వికెట్లను కోల్పోయింది. ఫామ్ లో ఉన్న సాల్ట్, బ్రూక్, బట్లర్, బాంటన్ అవుట్ అయ్యారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 4 వికెట్లకు 95 పరుగులు. ఈ దశలో వచ్చాడు బెతల్. నాలుగు వికెట్లు […]

Jacob Bethell super century: టీమిండియా 253 పరుగులు చేసింది. ఐసీసీ నిర్వహించే నాకౌట్ టోర్నీలో ఈ స్కోర్ చాలా పెద్దది. ముఖ్యంగా టి20 ఫార్మేట్ లో అత్యంత కష్టమైనది. ఇంతటి స్కోర్ ను చేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు త్వరగానే 4 వికెట్లను కోల్పోయింది. ఫామ్ లో ఉన్న సాల్ట్, బ్రూక్, బట్లర్, బాంటన్ అవుట్ అయ్యారు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 4 వికెట్లకు 95 పరుగులు.

ఈ దశలో వచ్చాడు బెతల్. నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. భారత బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. ఓవర్ కు 12 చొప్పున పరుగులు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి బౌలర్ల బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హార్థిక్ పాండ్యా బౌలింగ్లో రెచ్చిపోయాడు. చివరికి బుమ్రా బౌలింగ్ ను కూడా లక్ష్య పెట్టలేదు. బెతల్ దూకుడు వల్ల ఇంగ్లాండ్ జట్టు కేవలం 8.2 ఓవర్లలో 100 పరుగులను కంప్లీట్ చేసింది. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు అంటే బెతల్ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. మరో 26 బంతుల్లోనే అతడు సెంచరీ చేశాడు.

వాస్తవానికి నాలుగు వికెట్లు కోల్పోయి.. తీవ్రమైన ఇబ్బందుల్లో జట్టు ఉన్నప్పుడు ఏ ఆటగాడు కూడా ఇటువంటి సాహసం చేయడు. కానీ బెతల్ బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఆడుతున్నది ఇంగ్లాండ్లోన అన్నట్టుగా పరుగుల వరద పారించాడు. బెతల్ సూపర్ ఇన్నింగ్స్ తర్వాత.. మైదానంలో అతడికి ఇంగ్లాండ్ ప్లేయర్లు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ సమయంలో అక్కడే ఉన్న బెతల్ తండ్రి అతడిని దగ్గరికి తీసుకున్నాడు. గొప్పగా ఆడావని భుజం తట్టాడు.. బెతల్ ఆడిన ఇన్నింగ్స్ ను కెప్టెన్ బ్రూక్ కూడా కొనియాడాడు. ఇంగ్లాండ్ జట్టు ఏ దశలో కూడా ఓటమిని ఒప్పుకోదని.. తాజా మ్యాచ్ దానిని నిరూపించిందని అతడు పేర్కొన్నాడు.. బెతల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడి గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper