spot_img
Homeక్రీడలుక్రికెట్‌Chennai Super Kings Latest Update Before IPL Season: ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. చెన్నై...

Chennai Super Kings Latest Update Before IPL Season: ఐపీఎల్ ప్రారంభానికి ముందే.. చెన్నై సూపర్ కింగ్స్ మొదలుపెట్టింది..

Chennai Super Kings Latest Update Before IPL Season: ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. అయినప్పటికీ చెన్నై ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి చెన్నై జట్టును ఎవరు నడిపిస్తారు? ధోని పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. ఈ సంశయం కొనసాగుతున్నప్పటికీ.. చెన్నై మేనేజ్మెంట్ తన దూకుడు అయిన నిర్ణయాలు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది.

Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి

చెన్నై జట్టుకు ప్రధాన కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యవహరిస్తున్నాడు. క్రమంలోనే చెన్నై జట్టు ఫీల్డింగ్ విభాగాన్ని పటిష్టం చేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఫీల్డింగ్ కోచ్ గా జేమ్స్ పోస్టర్ ను నియమించినట్టు వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో చెన్నై జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో గొప్ప ప్రదర్శన చేయాలని చెన్నై జట్టు భావిస్తోంది. అందువల్లే ఇంగ్లాండ్ మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ జేమ్స్ పోస్టర్ ను చెన్నై జట్టు ఫీల్డింగ్ కోచ్ గా నియమించింది. పోస్టర్ కు 45 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతడు 2001 నుంచి 2009 మధ్య ఏడు టెస్టులు, 11 వన్డేలు, 5 t20 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నెల చివరిలో అతడు చెన్నై జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది.

“అతడు మాతో త్వరలో చేరుతాడు. ఫీల్డింగు కోచ్ గా వ్యవహరిస్తాడని” చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నాడు. గతంలో పోస్టర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేశాడు. గతంలో డెసర్ట్ వైపర్స్, నర్తన సూపర్ ఛార్జర్స్, పెద్దాపురం జల్మీ వంటి జట్లకు కూడా పనిచేశాడు. చెన్నై జట్టుకు ప్రధాన కోచ్ గా ఫ్లెమింగ్, మైక్ హస్సి (బ్యాటింగ్ కోచ్), ఎరిక్ సైమన్స్ (బౌలింగ్ కోచ్), శ్రీధరన్ శ్రీరామ్ (అసిస్టెంట్ బౌలింగ్ కోచ్) పనిచేస్తున్నారు.

ఇటీవల చెన్నై జట్టు ఆటగాళ్ల కోసం ఫ్రీ సీజన్ ట్రైనింగ్ సెషన్ మొదలుపెట్టింది. ఇందులో ధోని నుంచి మొదలుపెడితే ఆయుష్ మాత్రే వరకు హాజరయ్యారు.. వచ్చే సీజన్లో గొప్ప ప్రదర్శన చేయాలని చెన్నై జట్టు ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. అందువల్లే హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో తర్ఫీదు పొందినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

America Politics

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper