Homeక్రీడలుక్రికెట్‌Ashok Sharma: టీమిండియా కు మరో బుమ్రా దొరికేశాడు.. సాన పెడితే.. ప్రపంచ క్రికెట్...

Ashok Sharma: టీమిండియా కు మరో బుమ్రా దొరికేశాడు.. సాన పెడితే.. ప్రపంచ క్రికెట్ ను తగలబెడతాడు

Ashok Sharma: “అతడు అద్భుతం. టీమ్ ఇండియాకు దొరికిన వజ్రాయుధం. ఇటువంటి ఆటగాళ్లు జనరేషన్ కు ఒకరు మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో ఇతడు ప్రథమ స్థానంలో ఉంటాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా బౌలింగ్ చేస్తాడు. ఎప్పుడో తప్పితే.. ఊరికే పరుగులు ఇవ్వడు. వికెట్లు పడగొట్టి.. తన సత్తా ఏమిటో చూపిస్తాడు. ఆరు బంతులను ఆరు విధాలుగా వేస్తాడు. తన శక్తిని మించి జట్టు ప్రయోజనాల కోసం పాటుపడుతుంటాడు. ఇటువంటి ఆటగాడు టీమిండియాలో ఆడటం.. ఈ దేశపు గడ్డమీద […]

Ashok Sharma: “అతడు అద్భుతం. టీమ్ ఇండియాకు దొరికిన వజ్రాయుధం. ఇటువంటి ఆటగాళ్లు జనరేషన్ కు ఒకరు మాత్రమే ఉంటారు. అటువంటి వారిలో ఇతడు ప్రథమ స్థానంలో ఉంటాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా బౌలింగ్ చేస్తాడు. ఎప్పుడో తప్పితే.. ఊరికే పరుగులు ఇవ్వడు. వికెట్లు పడగొట్టి.. తన సత్తా ఏమిటో చూపిస్తాడు. ఆరు బంతులను ఆరు విధాలుగా వేస్తాడు. తన శక్తిని మించి జట్టు ప్రయోజనాల కోసం పాటుపడుతుంటాడు. ఇటువంటి ఆటగాడు టీమిండియాలో ఆడటం.. ఈ దేశపు గడ్డమీద పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం”

Also Read: ఉప్పల్ లో తిరుగులేని రికార్డులు ఉన్నా.. 300 కొట్టాలంటే సన్ రైజర్స్ చేయాల్సింది ఇదే

ఈ మాటలు టీమిండియా బౌలర్ బుమ్రా గురించి విరాట్ నుంచి మొదలు పెడితే రోహిత్ వరకు చెప్పినవి. టీమిండియాలో అన్ని ఫార్మాట్లలో గౌతమ్ గంభీర్ ప్రయోగాలు చేశాడు. రోహిత్ నుంచి మొదలు పెడితే విరాట్ వరకు స్థానచలనం కలిగించాడు. కానీ బుమ్రా విషయంలో గౌతమ్ గంభీర్ ఎటువంటి ప్రయోగాలు చేయలేకపోయాడు. కనీసం అతడు జోలికి కూడా రాలేకపోయాడు. దీనిని బట్టి అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా అద్భుతమైన బౌలర్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. పైగా అతడు ప్రతి ఓవర్ లోను తన విశ్వరూపం చూపిస్తూ ఉంటాడు. ఫార్మాట్ తో సంబంధం ఉండదు.. అయితే విపరీతమైన వర్క్ లోడ్ వల్ల బుమ్రా కు విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. అతడు కూడా సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. ఈ ప్రశ్న కొన్ని సంవత్సరాలుగా టీం ఇండియాలో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు దానికి సమాధానం దొరికేసింది.

బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్న బౌలర్ పేరు అశోక్ వర్మ.. ఇతడు ప్రస్తుత ఐపీఎల్ లో గుజరాత్ జట్టులో ఆడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక బంతిని ఏకంగా గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది పదవ వేగవంతమైన బంతి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్ షాన్ టైట్ 157.7 కిలోమీటర్ల వేగంతో మొదటి స్థానం.. ఫెర్గు సన్ 157.3, ఉమ్రాన్ మాలిక్ 157, మయాంక్ యాదవ్ 156.7, స్టెయిన్ 154.4, రబడ 154.2 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు.

అశోక్ శర్మకు వేగంతో పాటు అతడి ఎత్తు కూడా అడ్వాంటేజ్. ముఖ్యంగా యార్కర్లు.. షార్ట్ పిచ్ బంతులు.. పుల్లర్లు వేయడంలో అతడు సిద్ధహస్తుడు. స్లాగ్ ఓవర్లలో పదునైన బంతులు వేస్తాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కూడా. అతడిని గనక జాతీయ జట్టులోకి తీసుకొని.. అద్భుతమైన శిక్షణ ఇస్తే మరో బుమ్రా అవుతాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే అతని బౌలింగ్ మీద జాతీయ మీడియాలో విశ్లేషణాత్మక కథనాలు ప్రసారం అయ్యాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతని బౌలింగ్ గురించి రవి శాస్త్రి పదేపదే ప్రస్తావించడం విశేషం. ఒకవేళ గౌతమ్ గంభీర్ గనుక ఇతడికి అవకాశం కల్పిస్తే.. జట్టులో పాతుకుపోవడం మాత్రమే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తాన్ని తగలబెట్టడం గ్యారంటీ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper