Homeక్రీడలుక్రికెట్‌Ajinkya Rahane: ఇండియా 36 ఆల్ అవుట్.. రహానే వచ్చాడు.. ఆస్ట్రేలియా గర్వాన్ని నేలకు దించాడు

Ajinkya Rahane: ఇండియా 36 ఆల్ అవుట్.. రహానే వచ్చాడు.. ఆస్ట్రేలియా గర్వాన్ని నేలకు దించాడు

Ajinkya Rahane: మొత్తం యంగ్ ప్లేయర్లే.. జట్టుకు విరాట్ నాయకత్వం వహిస్తున్నాడు. అందరూ ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఆట మొదలుపెట్టారు. అడిలైడ్ టెస్ట్ లో ఏకంగా 36 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది. ఇది అందరికీ షాక్. మేనేజ్మెంట్ కి అయితే పెద్ద షాక్. జట్టుకు మూల స్తంభం లాంటి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలవల్ల ఇండియాకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియదు.. ఎవర్ని సారధిగా […]

Ajinkya Rahane: మొత్తం యంగ్ ప్లేయర్లే.. జట్టుకు విరాట్ నాయకత్వం వహిస్తున్నాడు. అందరూ ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఆట మొదలుపెట్టారు. అడిలైడ్ టెస్ట్ లో ఏకంగా 36 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది. ఇది అందరికీ షాక్. మేనేజ్మెంట్ కి అయితే పెద్ద షాక్. జట్టుకు మూల స్తంభం లాంటి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలవల్ల ఇండియాకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియదు.. ఎవర్ని సారధిగా నియమించాలో కూడా తెలియదు.

అలాంటి కష్ట సమయంలో జట్టుకు ఒక ఆప్షన్ లాగా కనిపించాడు అజింక్య రహానే. ఆస్ట్రేలియా బౌన్సీ మైదానాల మీద.. మన యంగ్ ప్లేయర్లను ఏకతాటి మీద నిలబెట్టాడు. బాహుబలి లో ప్రభాస్ లాగా.. జట్టు భారాన్ని మొత్తం తానే మోసాడు. ఒక రకంగా ఆస్ట్రేలియా బౌలర్లకు నైట్ మేర్ అయ్యాడు. బ్యాటింగ్ లో మూల స్తంభం లాగ నిలబడ్డాడు.. బౌలింగ్ వనరులు మొత్తం వాడుకున్నాడు. యంగ్ ప్లేయర్లకు సరైన దిశా నిర్దేశం చేసాడు.

సీన్ కట్ చేస్తే.. టీమిండియా రెండు మ్యాచ్లు గెలిచింది. ఆస్ట్రేలియా గర్వాన్ని ఆస్ట్రేలియాలోనే నేలకు దించింది. సారధిగా రహానే సెంచరీ కూడా చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు. 2021లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియా గెలిచేలా చేశాడు.

ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి.. 36 పరుగులకు ఆల్ అవుట్ అయిన టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డమీద.. ఆస్ట్రేలియా జట్టుపై గెలవడం అంత ఈజీనా.. విరాట్ కోహ్లీ లేకుండా.. ఇతర సీనియర్ ప్లేయర్లు లేకుండా ఆస్ట్రేలియా మీద గెలవడం అంత ఈజీనా.. కాదు కాదు.. అదంతా ఈజీ అని నిరూపించింది ముమ్మాటికి రహానే.

క్లాసిక్ షాట్లతో ఆకట్టుకున్నాడు. తిరుగులేని డిఫెన్స్ తో అదరగొట్టాడు. ద్రావిడ్.. లక్ష్మణ్ కలబోతతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ ముందు అడ్డుగోడ లాగా నిలబడ్డాడు. ఏ మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. స్థిరమైన ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుంది.. ఒక ఆటగాడు దృఢంగా నిలబడితే ఎలా ఉంటుందో నిరూపించాడు. వాస్తవానికి రహానే లేని లోటు మొన్నటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కనిపించింది. ఇకపై కూడా కనిపిస్తుంది. ఎందుకంటే క్రికెట్ అందరూ ఆడతారు. సెంచరీలు అందరూ కొడతారు. కానీ కళాత్మకంగా ఆడటం అందరికి సాధ్యం కాదు. అందులో రహనే ముందు వరసలోనే ఉంటాడు. కాదు కాదు ముందు స్థానంలోనే ఉంటాడు.. నాటిస్మృతులను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. వాటిని వీడియోల ద్వారా మరోసారి గుర్తుచేసింది. కానీ ఇన్నాళ్లుగా రహానేను మేనేజ్మెంట్ ఎందుకు దూరం పెట్టింది.. ఇదే ఇప్పుడు సమాధానం దొరకని మిలియన్ డాలర్ల ప్రశ్న.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper