IPL 2025 : కరణ్ నాయర్ గతంలో టెస్టులు అద్భుతంగా ఆడేవాడు. ఒకానొక సందర్భంలో టీమిండియాకు వివిఎస్ లక్ష్మణ్ లాంటి ఆటగాడు దొరికాడని అందరూ అనుకున్నారు. కానీ బీసీసీఐ లో ఉన్న రాజకీయాల వల్ల నాయర్ జట్టులో అవకాశం పొందలేకపోయాడు. ఆ తర్వాత రంజీలకే పరిమితమయ్యాడు. చివరికి ఐపీఎల్ లో కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు. అతడి స్నేహితుడు కేఎల్ రాహుల్ సిఫారసు వల్ల ఢిల్లీ జట్టు 50 లక్షలు కొనుగోలు చేసింది. చివరికి నిన్న ముంబై తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ఆటగాడు గానే మైదానంలోకి వచ్చాడు. ఆ తర్వాత తన ప్రతిభ ఏమిటో చూపించాడు. ఇప్పుడిక ఢిల్లీ జట్టు తదుపరి మ్యాచ్ లలో కచ్చితంగా అతడికి చోటు లభిస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. టెస్ట్ ఆటగాడిగా ముద్రపడిన నాయర్ తనను తాను మార్చుకోవడం వల్లే ఇలా రూపాంతరం చెందాడు. చివరికి అసలు సిసలైన టి20 ఆటగాడిగా మారిపోయాడు.. బుమ్రా లాంటి బౌలర్ బౌలింగ్ ను కూడా చితక్కొట్టాడు అంటే ఏ స్థాయిలో అతడు బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.. కరణ్ నాయర్ ఉదంతం ఆటగాళ్లు అప్డేట్ అవ్వడాన్ని ప్రధానంగా చెబుతోంది.. అలా అప్డేట్ కాకపోవడం వల్ల ప్రధానమైన ఆటగాళ్లు అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఇతడు మాత్రమే కాదు ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు నాయకత్వం వహిస్తున్న రహానే కూడా తనను తాను మార్చుకున్నాడు. ఒకప్పుడు టెస్ట్ ఆటగాడిగా ఉన్న అతడు.. ఇప్పుడు అనితర సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. దూకుడే మంత్రంగా పరుగులు తీస్తున్నాడు. ఏకంగా గత చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు నాయకత్వం వహిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో జట్టు స్థిరంగా విజయాలు సాధిస్తోంది.
Also Read : విరాట్ అభ్యర్థన.. తిరస్కరించిన రాహుల్ ద్రావిడ్.. ఇంతకీ ఏం జరిగిందంటే
హనుమ విహారి
హనుమ విహారి టీమిండియాలో ఆడాడు. అయితే టెస్టుల్లో తన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ ఆటగాడిగా మాత్రమే ముద్రపడ్డాడు. చివరికి జట్టులో కూడా స్థానాన్ని కోల్పోయాడు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తరఫున రంజీలో ఆడే అవకాశాన్ని కూడా దక్కించుకోలేకపోయాడు. చివరికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హనుమ విహారికి న్యాయం జరిగింది. అలాగని హనుమ విహారి దూకుడుగా ఆడుతున్న ఉదంతాలు కనిపించడం లేదు. గొప్ప ఇన్నింగ్స్ నిర్మిస్తున్న తార్కాణాలు దర్శనం ఇవ్వడం లేదు. ఏదో ఆడుతున్నాడు అంటే ఆడుతున్నాడు అంతే. అంటే తప్ప అతడిలో దూకుడు ఏమాత్రం కనిపించడం లేదు.
పూజార
టీమిండియాలో మరో రాహుల్ ద్రావిడ్ లాగా పేరు పొందాడు చటేశ్వర్ పూజార. అంతకుముందు సీజన్లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం పూజార. టెస్టులలో అడ్డుగోడలాగా నిలబడి.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడే నైపుణ్యం పూజార సొంతం. కానీ ఇదే పూజార టి20 కుట్ ఆడలేడు. కనీసం సత్తా చూపించలేడు. అందువల్లే అతడు టెస్ట్ ఆటగాడిగా మాత్రమే మిగిలిపోయాడు. చివరికి టెస్టుల్లో కూడా స్థానం సంపాదించలేకపోయాడు.. ఒకప్పుడు రాహు ద్రావిడ్ శిష్యుడిలాగా పేరుపొందిన అతడు.. ఇప్పుడు రంజీలకు మాత్రమే పరిమితమయ్యాడు..
అప్డేట్ అవ్వాల్సిందే
వాస్తవానికి క్రికెటర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. టెస్ట్ ఫార్మాట్ గొప్పదే అయినప్పటికీ.. ఇప్పుడంతా కూడా టి20 ల రాజ్యం నడుస్తోంది. భవిష్యత్తు కాలంలో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాంటప్పుడు గొప్ప గొప్ప ఆటగాళ్లు.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆటగాళ్లు కచ్చితంగా మారాల్సిందే. టి20లకు అలవాటు పడాల్సిందే. లేకపోతే హనుమ విహారి, పూజారలాగా మిగిలిపోతారు. తమకంటే జూనియర్లు అదరగొడుతుంటే చూస్తూ ఉండిపోతారు.
Also Read : బుమ్రా vs కరణ్ నాయర్.. కొట్టుకోవడమే తక్కువ