Today 8 February 2026 Horoscope: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఇందులో భాగంగా ఆదివారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు లక్ష్మీ కటాక్షం ఉండడం వల్ల ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి చట్టపరమైన చిక్కులు ఉంటే ఈరోజు తొలగిపోతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడంతో మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉండనున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహాయంతో అప్పులు తీరుస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. ఉద్యోగుల పదోన్నతిపై శుభవార్త వింటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు తోడు కావడంతో లాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈ రోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అంచనాలకు మించుతాయి. ఎవరికి అనవసరంగా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. వ్యాపారులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీరికి అధికారుల మద్దతు ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. ఉద్యోగుల బదిలీలు ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారు ఈ రోజు ఏ పని మొదలుపెట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లోని రహస్యాలు ఎదుటివారికి చెప్పొద్దు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అయితే వీటిని పరిష్కరించడానికి స్నేహితుల సహాయం తీసుకుంటారు. సోదరుల మధ్య ఆస్తికి సంబంధించిన విభేదాలు ఏర్పడతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారులకు గణనీయమైన లాభాలు ఉండనున్నాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదిస్తారు
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. నిరుద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే వీటిని పరిష్కరించుకోవడానికి స్నేహితుల సహాయం తీసుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
