తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశంలో అన్ని చిత్రపరిశ్రమలలో వారసుల హవానే ఎక్కువుగా నడుస్తుంది. అలాంటి వారసత్వంతో వచ్చిన అక్కినేని యువ కెరటం అఖిల్, మొత్తానికి వెబ్ సిరీస్ మేకర్స్ తో తన తరువాత సినిమాని ఫిక్స్ అయ్యాడు. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డైరక్టర్స్ రాజ్-డికెలతో అఖిల్ డైరెక్ట్ ఓ తెలుగు సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా సెట్ అయింది. కథ కూడా ఫైనల్ అయిందట. మొత్తానికి అఖిల్ మెలమెల్లగా మంచి డైరెక్టర్స్ తో తరువాత సినిమాలను లైనప్ సెట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.
Also Read: సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోయింది !
ప్రస్తుతం గీతా సంస్థలో బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సినిమాని సురేందర్ రెడ్డి డైరక్షన్ లో చేయనున్నాడు. ఆ సినిమా తరువాత సినిమాను కూడా ప్లాన్ చేసేసారు. అది వంశీ పైడిపల్లితో ఉంటుందట. ఇక ఇప్పుడు ఫ్యామిలీ మెన్ డైరెక్టర్స్ తో ఒప్పుకున్న సినిమా ఆ తరువాత మొదలవుతుందట. అయితే, ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. అఖిల్ కోసం ఈ సినిమాని ఒకరు సెట్ చేశారు. ఆ సెట్ చేసింది మరెవరో కాదు, స్వయానా అఖిల్ వదినగారు సమంతనే.
Also Read: అరె త్రిష పెళ్లి అట.. నిజమేనా !
సమంత ఈ మధ్య బాలీవుడ్ లో ఫ్యామిలీమాన్ వెబ్ సిరీస్ చేసింది. ఆ సిరీస్ లో టెర్రరిస్ట్ గా సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్-డికె ల దగ్గర ఓ కథ విన్నారు. ఆ కథ తన మరిదికి అయితే సూపర్ గా ఉంటుందని సమంత ఫీల్ అయిందట. అలా ఫీల్ అయిన వెంటనే.. అఖిల్ కి కథ చెప్పించింది. అఖిల్ కి కూడా కథ బాగా కనెక్ట్ అవ్వడంతో మొత్తానికి తెలుగు సినిమాను సెట్ చేశారు. పైగా డికె-రాజ్ లు తెలుగువారే. రాజ్ నిడుమూరు, కృష్ణ డికె అనే ఈ ఇద్దరు గతంలో డి ఫర్ దోపిడీ అనే సినిమాను కూడా తెలుగులో చేసారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Samantha did the set movie for akhil
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com