Rakht Brahmand
Rakht Brahmand: టాలీవుడ్ స్టార్ లేడీ సమంత తెలుగులో సినిమాలు తగ్గించింది. ఆ మధ్య అనారోగ్యం కారణంగా ఏడాది పాటు విరామం తీసుకుంది. సిటాడెల్: హనీ బన్నీ సిరీస్ తో కమ్ బ్యాక్ ఇచ్చింది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే హనీ బన్నీ తెరకెక్కించారు. ఈ యాక్షన్ సిరీస్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓ మోస్తరు రెస్పాన్స్ దక్కించుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2, హనీ బన్నీ సిరీస్లలలో రాజ్ అండ్ డీకేలతో సమంత పని చేసింది. ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ వీరి కాంబోలో వస్తుంది.
Also Read: ‘నా భర్త అలాంటి వాడు’ అంటూ సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!
ప్రైమ్ ఆస్థాన దర్శకులుగా ఉన్న రాజ్ అండ్ డీకే మరొక డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ కొరకు యాక్షన్ ఫాంటసీ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. రక్త్ బ్రహ్మాండ్ టైటిల్ తో ఈ సిరీస్ రూపొందుతుంది. సమంత లీడ్ రోల్ చేస్తుంది. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ సిరీస్ మీర్జాపూర్ తో ఫేమస్ అయిన నటుడు అలీ ఫజల్ ఈ సిరీస్ లో కీలక రోల్ చేస్తున్నాడు. కాగా ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ పై అంచనాలు పెంచేస్తున్నాయి.
లాంగ్ హెయిర్ తో లుక్ మార్చేశాడు అలీ ఫజల్. రక్త్ బ్రహ్మాండ్ కొరుకు ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వెయిట్ లిఫ్టింగ్, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందుతున్నాడట. అలాగే రోజుకు 6-7 గంటలు వ్యాయామం చేస్తున్నాడట. ఇదంతా రక్త్ బ్రహ్మాండ్ సిరీస్లో తన పాత్ర అద్భుతంగా రావడం కోసమే అంటున్నాడు. ఆ మధ్య రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ మధ్యలో ఆగిపోయింది అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలను టీమ్ ఖండించారు.
రక్త్ బ్రహ్మాండ్ కాన్సెప్ట్ పోస్టర్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. సమంత రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ లో ఎలాంటి పాత్ర చేస్తుందో అనే ఆసక్తి నెలకొంది. కాగా ఖుషి అనంతరం సమంత తెలుగులో సినిమా చేయలేదు. ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సమంత మా ఇంటి బంగారం టైటిల్ తో మూవీ ప్రకటించింది. తాను నిర్మిస్తూ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్డేట్ లేదు.
Also Read: కింగ్ స్టన్ ఫుల్ మూవీ రివ్యూ…
Web Title: Ali fazal reveals interesting things about his role in rakht brahmand
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com