Naga Chaitanya and Samantha : ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంట నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సమంత(Samantha Ruth Prabhu). వీళ్లిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నప్పుడు చాలా క్యూట్ పెయిర్, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అంటూ అందరూ ఎంతో సంతోషించారు. విడిపోయినప్పుడు వాళ్లిద్దరూ ఎంత బాధ పడ్డారో తెలియదు కానీ, అభిమానులు మాత్రం ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. సమంత, నాగ చైతన్య పేర్లు సోషల్ మీడియా లో తిరగని రోజంటూ లేదంటే అతిశయోక్తి లేదేమో. అయితే విడిపోయిన తర్వాత కూడా నాగ చైతన్య సమంత ని ఎంతో గౌరవం ఇస్తున్నాడు. ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. మా ఇద్దరి విడాకులలో నేనే కరెక్ట్ అన్నట్టుగా ఎప్పుడూ ఆయన కామెంట్ చేయలేదు. కానీ సమంత మాత్రం సందర్భం దొరికినప్పుడల్లా నాగ చైతన్య పై పరోక్షంగా కామెంట్స్ చేస్తూనే ఉంది.
Also Read : నాగ చైతన్య టాటూ ని తొలగించడానికి సమంత అంత పని చేసిందా..?
ఆమె కామెంట్స్ పై అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకున్న తర్వాత, ఇప్పటికీ దెప్పి పొడిచే మాటలు మాట్లాడడం సమంత కి మంచిది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గానే ఆమె ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె నాగ చైతన్య ని ఉద్దేశిస్తూ మరోసారి కామెంట్స్ చేసింది. విజయం సాధించడం అంటే స్వేచ్ఛ, స్వాతంత్రం పొందడమే అని చెప్పుకొచ్చింది. ఒక మనిషి ఏ పని చేయాలన్నా స్వాతంత్రం, స్వేచ్ఛ ఉండాలి. అంటే కానీ అది చేయొద్దు, ఇది చేయొద్దు అని కండీషన్స్ పెట్టకూడదు అంటూ చెప్పుకొచ్చింది. ఇది ఆమె ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది?, కచ్చితంగా నాగ చైతన్య నే కదా?, పెళ్లి తర్వాత సినిమాలు ఆపమన్నందుకే సమంత విడాకులు తీసుకుంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ సందర్భాన్ని ఉద్దేశించే ఈమె ఇలాంటి కామెంట్స్ చేసిందా?, ఇంకా ఎన్ని రోజులు ఇలా మాట్లాడుతుంది అంటూ ఆమెపై నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.
నాగచైతన్య శోభిత ని పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డాడు. తన పనులేవో తాను చేసుకుంటున్నాడు. సమంత కూడా అలా ఉండడం మంచిది. ఇలా గొడవలు పెంచుకుంటూ పోతే కచ్చితంగా అది ఆమెకు మంచి చేయదు అంటూ చెప్పుకొస్తున్నారు విశ్లేషకులు. సమంత గత కొంతకాలం గా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె అతన్ని పెళ్లి చేసుకొని స్థిరపడితే అక్కినేని అభిమానులు కూడా సంతోషిస్తారు. ఇకపోతే అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత, ఇప్పుడు మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో పాటు, నెట్ ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
Also Read : ఆ సలహాల కోసం సమంత కి ఫోన్ కాల్ చేస్తుంటా అంటూ నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!