Naga Chaitanya , Samantha
Samantha : సమంత హీరోయిన్ గా సక్సెస్ అయిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సమంత స్వయం కృషితో స్టార్ అయ్యింది. సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసేది. ప్యాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపడకుండా యాడ్స్ లో నటించేది. సమంతకు మొదట మాస్కోవిన్ కావేరి అనే తమిళ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో ఏమాయ చేసావే ఆడిషన్స్ లో పాల్గొన్న సమంతను గౌతమ్ మీనన్ వాసుదేవ్ ఎంపిక చేశాడు.
నాగ చైతన్యకు ఇది రెండో చిత్రం కాగా సమంతకు మొదటిది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఏమాయ చేసావే తెరకెక్కింది. సమంత-నాగ చైతన్యల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. 2010 ఫిబ్రవరి నెలలో విడుదలైన ఏమాయ చేసావే 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత, తన డెబ్యూ మూవీని ఉద్దేశించి మాట్లాడారు. ఏమాయ చేసావే మూవీలోని ప్రతి షాట్ జీవితాంతం గుర్తుండిపోతుంది అన్నారు. పరోక్షంగా ఆమె ఆ సినిమాలో నాగ చైతన్యతో చేసిన సన్నివేశాలు ఎప్పటికీ తన మదిలో చెదరకుండా ఉంటాయని చెప్పింది.
Also Read : నాగచైతన్య సినిమా కారణంగా సమంత కి అరుదైన పురస్కారం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!
తనకు తమిళ్ రాదు, అది మైనస్ అయ్యింది. అలాగే దిశానిర్ధేశం చేసేవారు లేక మంచి సినిమాలు చేయలేకపోయాను అని సమంత అన్నారు. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2017లో గోవా వేదికగా వీరి వివాహం జరిగింది. నాలుగేళ్లు కాపురం చేసిన ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. సమంత కెరీర్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
ఇటీవల ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది హాలీవుడ్ కి చెందిన సిటాడెల్ కి తెలుగు వెర్షన్. హనీ బన్నీ సిరీస్ ని ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ 3 రానుందని సమాచారం. ఈ సిరీస్లో సైతం సమంత నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
సమంత పరిశ్రమకు వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఈ క్రమంలో మాజీ భర్త నాగ చైతన్యతో చేసిన ఏమాయ చేసావే మూవీని ఉద్దేశించి ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. విడాకుల అనంతరం నాగ చైతన్యతో కలిసి చేసిన మూవీపై మాట్లాడటం చర్చకు దారి తీసింది.
సమంత హీరోయిన్ గా సక్సెస్ అయిన తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సమంత స్వయం కృషితో స్టార్ అయ్యింది. సమంత చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ చేసేది. ప్యాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద ఆధారపడకుండా యాడ్స్ లో నటించేది. సమంతకు మొదట మాస్కోవిన్ కావేరి అనే తమిళ చిత్రంలో ఆఫర్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ డిలే కావడంతో ఏమాయ చేసావే ఆడిషన్స్ లో పాల్గొన్న సమంతను గౌతమ్ మీనన్ వాసుదేవ్ ఎంపిక చేశాడు.
నాగ చైతన్యకు ఇది రెండో చిత్రం కాగా సమంతకు మొదటిది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఏమాయ చేసావే తెరకెక్కింది. సమంత-నాగ చైతన్యల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన సాంగ్స్ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. 2010 ఫిబ్రవరి నెలలో విడుదలైన ఏమాయ చేసావే 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత, తన డెబ్యూ మూవీని ఉద్దేశించి మాట్లాడారు. ఏమాయ చేసావే మూవీలోని ప్రతి షాట్ జీవితాంతం గుర్తుండిపోతుంది అన్నారు. పరోక్షంగా ఆమె ఆ సినిమాలో నాగ చైతన్యతో చేసిన సన్నివేశాలు ఎప్పటికీ తన మదిలో చెదరకుండా ఉంటాయని చెప్పింది.
తనకు తమిళ్ రాదు, అది మైనస్ అయ్యింది. అలాగే దిశానిర్ధేశం చేసేవారు లేక మంచి సినిమాలు చేయలేకపోయాను అని సమంత అన్నారు. హీరో నాగ చైతన్యను సమంత ప్రేమ వివాహం చేసుకుంది. 2017లో గోవా వేదికగా వీరి వివాహం జరిగింది. నాలుగేళ్లు కాపురం చేసిన ఈ జంట అనూహ్యంగా విడిపోయారు. 2021లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. సమంత కెరీర్ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
ఇటీవల ఆమె నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది హాలీవుడ్ కి చెందిన సిటాడెల్ కి తెలుగు వెర్షన్. హనీ బన్నీ సిరీస్ ని ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ 3 రానుందని సమాచారం. ఈ సిరీస్లో సైతం సమంత నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
Also Read : సమంతకు నాగ చైతన్య ఆఫర్ చేసిన భరణం ఎంతో తెలుసా? అక్కినేని ఫ్యామిలీ అహం మీద కొట్టిన స్టార్ లేడీ
Web Title: Samantha samantha will never forget those moments with naga chaitanya for the rest of her life
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com