Samantha
Samantha : మనది పురుషాధిక్య సమాజం. చిత్ర పరిశ్రమలో ఇది మరీ ఎక్కువ. ప్రతి క్రాఫ్ట్ లో వారిదే ఆధిపత్యం. ముఖ్యంగా హీరోలు చిత్ర పరిశ్రమను శాసిస్తారు. హీరోయిన్స్ కి మాత్రం అంత ప్రాధాన్యత ఉండదు. మహిళలు కూడా సినిమాకు అవసరం. కానీ పురుషులతో సమానమైన గౌరవం, వేతనం వారికి దక్కడం లేదు. ఒక స్టార్ హీరో రూ. 100 కోట్లు తీసుకుంటాడు. ఇండియా వైడ్ ఫేమ్ ఉన్న హీరోయిన్ కి రూ. 20 కోట్లు ఇస్తే చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగుతున్న పలువురు హీరోయిన్స్ రెమ్యూనరేషన్ రూ. 5 కోట్లు కంటే ఎక్కువ ఉండదు. ఇక ఓ మోస్తరు హీరోయిన్స్ రెమ్యూనరేషన్ లక్షల్లోనే.
Also Read : మరోసారి ‘బర్త్ డే’ పార్టీలో కొత్త ప్రియుడితో కలిసి జంటగా కనిపించిన సమంత..వైరల్ అవుతున్న ఫోటోలు!
దీన్ని గతంలోనే సమంత ప్రశ్నించింది. కెరీర్ బిగినింగ్ లో సమంత మాట్లాడుతూ.. ఒక సినిమా విజయంలో హీరోకి ఎంత పాత్ర ఉందో హీరోయిన్ కి కూడా అంతే పాత్ర ఉంటుంది. అలాంటప్పుడు రెమ్యూనరేషన్ లో ఇంత వ్యత్యాసం ఎందుకు అని సమంత ఓపెన్ గా మాట్లాడారు. ఒక వర్తమాన హీరోయిన్ అలాంటి కామెంట్స్ చేయడం పెద్ద సాహసమే. నిర్మాతలను, హీరోలను అది ఎదిరించడమే అవుతుంది. కానీ సమంత నిర్భయంగా తన మనసులోని మాట బయటపెట్టింది.
మాటలతో కాకుండా తన ఆలోచనలను చేతల్లో చూపెడుతుంది సమంత. తాను నిర్మాతగా తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారం మూవీకి పని చేస్తున్న నటులు, సాంకేతిక నిపుణులకు లింగ బేధం లేకుండా రెమ్యూనరేషన్స్ ఇస్తుందట. మగాళ్లతో సమానంగా ఆడవాళ్లకు చెల్లిస్తుందట. ఈ విషయాన్ని లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి బయటపెట్టింది. అనాదిగా ఉన్న సాంప్రదాయాన్ని సమంత బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది. హీరోలతో సమానంగా హీరోయిన్స్ కి వేతనం, గౌరవం దక్కాలని సందేశం పంపుతుంది.
అయితే ఒక సినిమా బిజినెస్ హీరో ఆధారంగానే నడుస్తుంది. సమంత కోరుకునే మార్పు అంత సులభం కాదు. హీరోలకు సమానంగా హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్ చెల్లిస్తే బడ్జెట్ పెరిగిపోతుంది. అలా అని హీరోలు తాము తీసుకునే వందల కోట్ల రెమ్యూనరేషన్స్ లో కొంత భాగం హీరోయిన్స్ కి దక్కేలా చేయరు. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన సమంత మా ఇంటి బంగారం మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది.
Also Read : ఆ సినిమాను సమంత గుట్టుగా షూట్ చేస్తుందా? డైరెక్టర్ ఎవరంటే?
Web Title: Samantha daring step confronting heroes
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com