Kavitha vs Pawan Kalyan : రాజకీయ నాయకులకు సెన్సిటివిటీ బాగా తగ్గిపోయింది. అదే మిగతా వాళ్లు సమాజంలో ఏదైనా తప్పు చేస్తే బయటకు రావడానికి సిగ్గుపడుతారు. జైలు జీవితం గడిపిన వారు అసలు ఇంటి నుంచి బయటకు కాలు కూడా పెట్టరు. కల్వకుంట్ల కవిత ఒక మహిళ అయ్యిండి లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లి వచ్చి ఏమీ జరగనట్టుగా ఒక సెలబ్రెటీలాగా.. అదే అహంతో మాట్లాడుతోంది.
నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ మీద నోరుపారేసుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ చానెల్ పాడ్ కాస్ట్ లో మాట్లాడింది. జగన్ కూడా 14 నెలలు జైలు జీవితం అనుభవించి స్వాతంత్ర్య సమరయోధుడిలా బయటకు చేతులు ఊపుకుంటూ వచ్చారు.
కల్వకుంట్ల కవిత పాడ్ కాస్ట్ లో జగన్ పై పొగడ్తల వర్షం కురిపించింది. కష్టాలు అధిగమించి సీఎం అయ్యారని కొనియాడారు. పవన్ పై మాత్రం నోరుపారేసుకుంది. రాజకీయాల్లో యాక్టింగ్ చేసే పొలిటీషియన్ అంటూ కవిత దారుణంగా మాట్లాడింది.
అసలు జోక్ ఇన్ పాలిటిక్స్.. ఏదో లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారని.. సీరియస్ పొలిటీషన్ కాదు.. మాట మీద నిలబడడు అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతాడని కవిత దారుణంగా పవన్ పై కామెంట్స్ చేసింది.
పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకున్న కవిత తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.