Hanuman Jayanti : శ్రీరాముడు భక్తుడైనా హనుమంతుడి జయంతిని ప్రతీ ఏడాది జరుపుకుంటారు. చైత్ర మాసంలో ప్రతీ ఏడాది పౌర్ణమి రోజున శ్రీ హనుమంతుడి జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ పండుగను జరుపుకుంటున్నారు. హనుమాన్ జయంతి రోజు భక్తితో హనుమంతుడిని పూజిస్తే అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈజీగా తీరిపోతాయని పండితులు చెబుతుంటారు. అయితే హనుమాన్ జయంతి రోజును భక్తితో పూజిస్తే కోరిన కోరికలు అన్ని కూడా తీరుతాయి. అలాగే తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తే మాత్రం దురదృష్టం, నష్టాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే హనుమాన్ జయంతి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read :నవ పంచమియోగంతో ఈ రాశుల వారి జీవితాల్లో వెలుగులు.. వద్దన్నా ఆదాయం..
హనుమాన్ జయంతి నాడు ఎంతో భక్తితో పూజించాలి. అప్పుడే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే కొందరి ఇంట్లో ఎవరికైనా చనిపోవడం వంటి ముట్టు ఉంటుంది. ఇలాంటి వారు అసలు పూజ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు హనుమాన్ జయంతి నాడు తెలుపు లేదా నలుపు రంగు దుస్తులు ధరిస్తుంటారు. వీటివల్ల ఇంట్లో అన్ని కూడా సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. హనుమంతుడికి అన్ని రంగుల్లో ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. హనుమాన్ జయంతి నాడు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. ఇంట్లో పరిస్థితులు అన్ని కూడా కుదటపడతాయని పండితులు అంటున్నారు.
కొందరు విరిగిన లేదా పగిలిన హనుమంతుని విగ్రహాలను పూజిస్తుంటారు. ఇలాంటి వాటిని పూజించడం వల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తాయని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి నాడు ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ఉప్పు, దానం, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని అంటున్నారు. హనుమాన్ జయంతి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే నిద్రలేచి పూజలు చేయాలి. అలాగే హనుమాన్ టెంపుల్‌ను దర్శించుకోవాలి. భక్తితో హనుమాన్‌ను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి నాడు తమళపాకు, వడ దండలను హనుమాన్‌కి వేస్తే కోరిన కోరికలు వెంటనే తీరుతాయని పండితులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.