ప్రియాంక గాంధీ నిన్నటి పార్లమెంట్ ప్రసంగంతో తానొక మెరుగైన నాయకురాలిని అని నిరూపించుకుంది. ప్రియాంక గాంధీ ప్రసంగం చూశాక రాహుల్ కంటే ఎంతో బెటర్ అనిపించింది. ప్రియాంక గాంధీ ఆలోచనలు రాహుల్ కంటే మెరుగ్గా అనిపించింది.
ప్రియాంక గాంధీ పాలస్తీనా బ్యాగు వేసుకొని పార్లమెంట్ కు వచ్చింది. భారత్ రెండుదేశాలను గుర్తించింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ లకు సమానంగా హోదా ఇచ్చింది.
ప్రియాంక గాంధీ పై కేసులున్నాయి. భర్త వాద్రాపై అవినీతి కేసులున్నాయి. రాజకీయంగానూ ప్రియాంక పెద్దగా సాధించలేదు. రాహుల్ తో కాంగ్రెస్ చేసిన ప్రయోగం ప్రతీసారి ఫెయిల్ అవుతూనే ఉంది. ఇప్పటికైనా రాహుల్ తో కాంగ్రెస్ ను నడిపించే బదులు అంతో ఇంతో బెటర్ అయిన ప్రియాంకతో కొత్త ప్రయోగం చేస్తే కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోయింది. ఇందిరా బతికున్నప్పుడే సంజయ్ గాంధీని తీసుకొచ్చింది. ఇందిర చనిపోయాక రాజీవ్ గాంధీ అయ్యారు.. రాజీవ్ చనిపోయాక సోనియా పగ్గాలు అందుకుంది. సోనియా తర్వాత రాహుల్ బాధ్యతలు చేపట్టారు. విఫలమవుతూనే ఉన్నారు.
రాహుల్ గాంధీ కన్నా మెరుగైన నాయకురాలని నిరూపించుకున్న ప్రియాంక గాంధీ. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కిందివీడియో లో చూడొచ్చు.