Rahul Gandhi PM candidate : రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి ఓకేనంట.. ఇటీవల హైదరాబాద్ పక్కన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ డీసీసీ అధ్యక్షుల వర్క్ షాప్ జరిగింది. ఈ చివరి రోజున రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సమావేశంలో రాహుల్ ను ప్రధానిగా మీరు ఒప్పుకోవాలని.. నిలబడాలని మేమంతా సపోర్ట్ చేస్తామంటూ తెలంగాణ సీఎం రేవంత్ చేసిన ప్రతిపాదనకు రాహుల్ గాంధీ ఓకేనని తలూపాడు.
అయినా భారత ప్రధాని పదవి ఏమన్నా అంట్లో సరుకా? ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలి. మీకు మద్దతిచ్చే అన్నీ పార్టీలు కలిసి ముందుగా మిమ్మల్ని నాయకుడిగా ఎన్నుకోవాలి. వాళ్లందరికీ ముందు మెజార్టీ రావాలి.. గెలివాలి.. ఆ పార్టీలన్నీ నాయకుడిగా మిమ్మల్ని ఎన్నుకోవాలి.
అసలు ఇప్పటివరకూ ఏమీ లేకుండా రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ఒప్పుకోవడం ఏంటో.. ప్రచారం చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నికలు ఇప్పుడు లేనే లేవు. 2024 మేలో ఎన్నికలు అయిపోయాయి.. 2029 వరకూ అసలు ఎన్నికలు లేవు. అసలు కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదు.ముందుగా మీకు మెజార్టీ ప్రజలు ఇవ్వాలి కదా.. తర్వాత ప్రధానిగా ఎన్నికవుతారు..
దేశంలో కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ గానే ఉంది. 187 స్థానాల్లో పడిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి.. రాహుల్ గాంధీ ప్రధాని పదవికి ఓకేనంట.. దీనిపై ‘రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.