Tea drinkers: మనం ప్రతిరోజు ఉదయం లేవగానే టీ తాగుతూ ఉంటాం. కొందరికి బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టేసరికి చేతి దగ్గరికి టీ కప్పు వస్తుంది. అయితే ఈ టీ తయారు చేయడానికి ఇంట్లోని ఆడవారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ ఇదే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. టీ ని ఫిల్టర్ చేసే క్రమంలో ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల అందులోని ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లి అనేక అనారోగ్యానికి గురవుతున్నారు. టీ ఫిల్టర్ తో శరీరంలోకి ప్లాస్టిక్ ఎలా వెళుతుంది? అన్న సందేహం మీకు రావచ్చు. కానీ ఇది తెలిస్తే మాత్రం షాక్ కు గురికాకుండా ఉండరు. అంతేకాకుండా ఈ ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు వైద్యులు తేల్చారు.
మనం తినే ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించవద్దు అని ఇప్పటికే చాలామంది వైద్యులు తెలుపుతున్నారు. కానీ ఏదో రకంగా ప్లాస్టిక్ వస్తువులను తప్పనిసరిగా వాడుతున్నాం. ఉదయం లేవగానే టీ ని ఫిల్టర్ చేసే క్రమంలో ప్లాస్టిక్ వస్తూనే ఉపయోగిస్తుంటాం. అయితే మన దేశంలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ తో ఈ టి ఫిల్టర్ ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టీ నీ వడపోసి సమయంలో వేడి ద్రవం ఫిల్టర్ కు తగిలి మైక్రో ప్లాస్టిక్ టీ లో కలిసిపోతుంది. దీంతో ఇది శరీరంలోకి వెళ్లి రకరకాల అనారోగ్యాల కు కారణం అవుతుంది. కొన్ని రకాల ప్లాస్టిక్ ఫిల్టర్ లో BPA, BPS వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి వేడి పదార్థాలు తాకినప్పుడు లీచింగ్ జరుగుతుంది. ఇలా జరిగిన పదార్థాలను తీసుకుంటే శరీరంలో హార్మోన్ల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్లాస్టిక్ పై వేడి తగలడం వల్ల ఒక రకమైన రసాయన వాసన కూడా రావచ్చు. ప్లాస్టిక్ ఫిల్టర్ నిత్యం వేడి గిన్నెలో ఉండడం వల్ల ఇందులో ఉండే ప్లాస్టిక్ టీ లో కలిసిపోతుంది. ప్లాస్టిక్ టీ ఫిల్టర్ ను నాణ్యతాలేని ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా మారనుంది.
ఇలా ప్లాస్టిక్ టీ ఫిల్టర్ లో వాడడం వల్ల క్యాన్సర్, థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, పురుషులలో ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు రావచ్చు అని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మగవారిలో సంతానలేమి కలగడానికి కారణం ఈ ప్లాస్టిక్ కూడా కారణం ఉందని కొందరు వైద్యులు తేల్చారు. ఎందుకంటే ప్రతిరోజు తప్పనిసరిగా టీ నీ తాగాల్సి వస్తుంది. ఇలా ఎంతో కొంత ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్లి ఈ రకమైన సమస్యలు వస్తుంటాయి. అందువల్ల ప్లాస్టిక్ టీ ఫిల్టర్ ను వాడకపోవడమే మంచిదని అంటున్నారు. వీటి స్థానంలో క్లాత్ లేదా ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని అంటున్నారు.