spot_img
Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh - Trivikram : బండ్ల గణేష్ ... త్రివిక్రమ్ పై ఎందుకలా విరుచుకు...

Bandla Ganesh – Trivikram : బండ్ల గణేష్ … త్రివిక్రమ్ పై ఎందుకలా విరుచుకు పడుతున్నాడు? ఎక్కడ చెడింది ?

Bandla Ganesh – Trivikram : కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత అందరికీ ఊహించని షాక్ ని ఇస్తూ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా మారిన బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. .ఆయన పేరు తీస్తే పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తాడు. అంత పెద్ద వీరాభిమాని ఆయన, స్టేజి మీద మైక్ అందుకుంటే పవన్ జపంతో ఊగిపోతాడు. పవన్ ని ఉద్దేశిస్తూ ఆయన గురించి పూనకాలు వచ్చి ఊగిపోయే రేంజ్ ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు.

పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు వస్తున్నారా అనేది చూడరు ఫ్యాన్స్, బండ్ల గణేష్ వస్తున్నాడా లేదా అనేదే చూస్తారు. పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ లో ఆయనకీ ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే బండ్ల గణేష్ ప్రసంగాలు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇబ్బందులు కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ ఇచ్చిన స్పీచ్ ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

‘ఈశ్వర పవనేశ్వర’ అంటూ ఆయన ఇచ్చిన ప్రసంగం పెద్ద హిట్ అయ్యింది. దాంతో పాటు ఆయన పొలిటికల్ పరంగా కూడా అధికార పార్టీ పై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ రిలీజ్ వేళ పొలిటికల్ గా వెళ్లి విమర్శలు చేయడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వకీల్ సాబ్ చిత్రంపై సరికొత్త జీవోని ప్రయోగించి అతి తక్కువ రేట్స్ తో సినిమాని రన్ చేసుకునేలా చేసి కలెక్షన్స్ దెబ్బకొట్టింది.. ఫలితంగా వకీల్ సాబ్ చిత్రం ఘోరంగా నష్టపోయింది.

ఇది దృష్టిలో ఉంచుకునే బండ్ల గణేష్ ప్రసంగాలతో డ్యామేజ్ బాగా జరుగుతోందని గ్రహించిన పవన్ కళ్యాణ్ ప్రాణస్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనని బాగా దూరం పెట్టేసాడు. నా దేవుడికి నన్ను దూరం చేస్తావా అంటూ అప్పటి నుండి బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.

తాజాగా ట్విట్టర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై డైరెక్ట్ అటాక్స్ చేస్తున్నాడు. పవన్ కు , బండ్ల గణేష్ కు మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్ కారణమన్న భావన పాతుకుపోయింది. మరి త్రివిక్రమ్ మీద ఆయన పగ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా, లేదా భవిష్యత్తులో పోతుందా అనేది చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper