Homeజాతీయ వార్తలుBJP Politics : బీజేపీ జబ్బలు చరచడం వెనుక ఉన్న అసలు కథ ఇది!

BJP Politics : బీజేపీ జబ్బలు చరచడం వెనుక ఉన్న అసలు కథ ఇది!

BJP Politics : వాలితో పోరాడేవాడి బలం ఎదురు పడగానే సగం అయిపోతుంది. అది రామాయణం. రాజకీయాల్లో బీజేపీ ఎత్తుగడలు కూడా ఇలాగే ఉంటాయ్. యంత్రాంగం, వ్యవస్థ గుప్పిట్లో ఉంటాయ్. మీడియా అండతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తది. దీనికితోడు కొన్ని తోక పార్టీలు రంగంలోకి దిగుతాయ్. ఉపఎన్నికల్లో ఈ బ్యూటీ మరోసారి బయటపడింది.

బీహార్‌లో నితీశ్ వీడి పోయాక రెండు చోట్ల ఉప ఎన్నికలు. ఒకటి ఆర్జేడీ గెలిచింది. మోకామా… అది ముందు నుంచి బీజేపీకి అచ్చిరాదు. మిత్ర పక్షాలకు ఇచ్చేసేది. ఇప్పుడు ఓడింది. రెండో సీటు గోపాల్ గంజ్. ఇది బీజేపీ సిట్టింగ్. ఎమ్మెల్యే మరణించడంతో వచ్చింది ఉప ఎన్నిక. 1,800 ఓట్ల తేడాతో గెలిచింది. ఇక్కడ ఎఐఎంకు 12,300 ఓట్లు, బీఎస్పీకి 9 వేల ఓట్లు వచ్చాయ్. అదీ అచ్చులో బొమ్మ. బీఎస్పీ నిజానికి యూపీలో ఊపలేదు. మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయలేదు. కానీ ఇలాంటి చోట్ల పోటీ చేసి ఓట్లు చీల్చేస్తది. ఇక ఓవైసీ ఒప్పందానికి కట్టుబడతాడు తిరుగులేదు. ఒకచోట గెలిచారు కాబట్టి సేఫ్. మహా ఘట్ బంధన్ ప్రభావం లేదు అని ప్రచారం చేయొచ్చు. గోపాల్ గంజ్ లో పోటీ చేసింది లాలూ యాదవ్ బావమరిది భార్య కాబట్టి… ఆర్జేడీది జంగిల్ రాజ్ అని దెప్పిపొడవొచ్చు. ఎనిమిదేళ్లుగా మనం ఏం పొడిచామో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇక కులాసాగా ఉండొచ్చు.

ఇవే తోక పార్టీలు మహారాష్ట్రలో అంధేరీ వెస్ట్ లో మాత్రం పోటీ చేయలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ పోటీలో లేదు. వీళ్లు అవసరం లేదన్న మాట. శివసేనను చీల్చి చంపుడు పందెం వేసింది బీజేపీ. అంధేరీ థాకరేల స్ట్రాంగ్ హోల్డ్. వచ్చే నెలలోనే బీఎంసీ ఎన్నికలు ఉన్నాయ్. ఇలాంటి సమయంలో రంగంలోకి దిగి భంగపడితే బీఎంసీలో ఎదురు కొడుతుంది. అందుకే అక్కడ బీజేపీ ఓ మహత్తరమైన సాకు చెబుతోంది. సేన సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో వచ్చిన ఎన్నికలో పోటీ చేయదట! అది పార్టీ సంప్రదాయం కాదట. మరి ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోతే గత ఏడాది కాలంలో రెండు ఉప ఎన్నికలు జరిగాయ్. ఇక్కడ బీజేపీ బరిలో దిగి నోటాతో పోటీ పడింది. అదేంటో ఇక్కడ సంప్రదాయం గుర్తు లేదు బీజేపీకి. జాతీయ పార్టీ అయినా వీధికో విధానం ఉంటుందేమో..

ఇక మునుగోడు సంగతి. ఇక్కడ శక్తియుక్తులన్నీ ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అప్పడాల కర్రలు, రోడ్డు రోలర్లు లాంటి కారును పోలిన గుర్తులు రంగంలోకి దింపింది. ప్చ్ వర్కవుట్ కాలేదు. టీఆర్ఎస్ మీద కూడా సింపథీ లేదు నిజానికి. కాంగ్రెస్ పూర్తిగా నీరసపడింది అక్కడ. అయినా బీజేపీ గెలవలేదు అంటే ఉపఎన్నిక ఎత్తుగడకి చెక్ పడినట్టే అనుకోవాలేమో .. ఇంకా ఏడాదిలోనే తెలంగాణ ఎన్నికలు. కాబట్టి ఇక ఇలాంటి చిన్నెలు కనిపించకపోవచ్చు.

మొత్తానికి బీజేపీ జబ్బలు చరవడం వెనక చాలా తతంగం ఉంటుందని ఈ ఉపఎన్నికలు మరోసారి రుజువు చేశాయ్. అదీ అట్లుంటది బీజేపీతోని.. ముందుగానే చెప్పినట్టు దానిదంతా “వాలీ, సగం బలం సిద్దాంతం”

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper