Bigg Boss 6 Telugu:ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్స్ పై గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..హౌస్ లో టాస్కులు ఆడేవాళ్ళందరిని ఇంటికి పంపేస్తున్నారు..బిగ్ బాస్ ని చూడడానికే చిరాకు వచ్చేస్తుంది అంటూ కామెంట్స్ రావడం మనం గమనిస్తూనే ఉన్నాము..అర్జున్ , సూర్య వంటి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడమే పెద్ద షాక్ అంటే ఈరోజు గీతూ లాంటి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కి గురి చేసింది..ఆమె ఎలిమినేట్ అవ్వదు.

కచ్చితంగా ఆమెని సీక్రెట్ రూమ్ లో దాచిపెడుతారు అని అందరూ అనుకున్నారు..కానీ అవన్నీ మన ఊహాగానాలే..గీతూ నిజంగానే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసింది..బాలాదిత్య విషయం లో ఆమె ఆడిన గేమ్ జనాలకు నచ్చకపోవడం వల్లే ఆమె ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది..ఈ సీజన్ లో హౌస్ మేట్స్ కి మరియు జనాలకు ఊహించని అతిపెద్ద షాక్ అంటే ఇదే.
హౌస్ నుండి ఎలిమినేట్ అని చెప్పగానే గీతూ రియాక్షన్ చూసి ఆమెని ఇష్టపడని వాళ్ళు కూడా కంటతడి పెట్టేసారు..ఇక హౌస్ మేట్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..ప్రతిఒక్కరు వెక్కిళ్లు పెట్టిమరీ ఏడ్చేశారు..ఎన్నడూ లేని విధంగా రేవంత్ వంటి వారు కూడా కంటతడి పెట్టేసాడు అంటే గీతూ హౌస్ అందరికి ఎంతలా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు..ఇక హౌస్ నుండి బయటకి అడుగు పెట్టిన తర్వాత గీతూ చిన్నపిల్లలాగా ఏడవడం మొదలు పెట్టింది..స్టేజి మీదకి రాగానే తన AV చూసుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది.
ఇక రేవంత్ తన కోసం పాట పాడుతున్నప్పుడు అయితే చిన్న పిల్లలాగా ‘నేను వెళ్ళను..ఇక్కడే ఉంటాను’ అంటూ నాగార్జున గారిని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది..ఆమె ఏడవడం చూసి ఇంటి సభ్యులు చూస్తున్న ప్రేక్షకులతో పాటుగా పక్కనే ఉన్న నాగార్జున గారు కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు..చలాకీగా ఆడుతూ అందరిని ఆటపట్టిస్తూ సరదాగా ఉండే గీతూ జర్నీ ఊహించని విధంగా బిగ్ బాస్ లో ఇలా ముగిసిపోయింది.