spot_img
Homeజాతీయ వార్తలుSchool in the Thar Desert : థార్ ఎడారిలో బాలికల కోసం ఏసీ స్కూల్.....

School in the Thar Desert : థార్ ఎడారిలో బాలికల కోసం ఏసీ స్కూల్.. మండే ఎండలో కూల్ గా.. ఎలా నిర్మించారంటే..

School in the Thar Desert : దేశంలో అత్యధిక ఎడారి కలిగిన ప్రాంతం ఏదంటే ఠక్కున చెప్పేస్తాం.. ‘థార్ ఎడారి’ అని. మిగతా ప్రాంతాల్లో వేసవి కాలంలోనే వేడి ఉంటుంది. కానీ థార్ ఎడారిలో ఎప్పుడూ ఎండ మండిపోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతటి ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతంలో పిల్లల చదువుల కోసం ఓ పాఠశాల నిర్మించారు. అది కూడా రాజస్థాన్ లోని థార్ ఎడారి ఉండే జైసల్మార్ లోని ప్రత్యేకంగా బాలికల కోసమే నిర్మించారు. అక్కడి బాలికలు విద్యకు దూరమవుతుండడంతో కొన్ని ఫౌండేషన్లు కలిసి దీన్ని నిర్మించాయి. థార్ ఎడారిలో మాములు జనాలు ఉండడానికే ఇబ్బందులు పడుతారు. కానీ పిల్లలు ఎలా ఉండగలుగుతారు..? అనే ప్రశ్న రావచ్చు. కానీ ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం కలిగించే విధంగా స్కూల్ ను నిర్మించారు. ‘డయానా కెల్లగాన్’ అనే మహిళా డిజైన్ రూపొందించగా.. జై సల్మీర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మన్వేందర్ సింగ్ స్కూల్ కోసం 22 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటో చూద్దాం..

సాధరణంగా వేసవి కాలం రాగానే స్కూల్ విద్యార్థులకు సెలవులు ఇచ్చేస్తారు. కానీ థార్ ఎడారిలో ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఓ స్కూల్ భవనాన్ని నిర్మించారు. జై సల్మేర్ శామ్ డ్యూన్స్ లో కనోయ్ గ్రామ సమీపంలోని థార్ ఎడారిలో ఉంది ‘రాజకుమారి రత్నావతి’ బాలికల పాఠశాల. ఈ స్కూల్ లో 400 మంది విద్యార్థులు చదువుకునేలా కాంప్లెక్స్ నిర్మించారు. ఇందులో ఒక మ్యూజియం, రెండు ప్రదర్శన శాలలు ఉన్నాయి.

ఇందులోనే ఓ లైబ్రరీ, ఆడియో విజువల్ లెక్చర్ హాల్ కూడా ఉన్నాయి. న్యూయార్క్ కు చెందిన డయానా కెల్లగాగా డిజైన్ రూపొందిందించగా.. రిజిస్టర్ అయిన సిట్టా అనే సంస్థ ఈ స్కూల్ ను నిర్మించింది. బాలికలు మాత్రమే చదువుకునే ఇందులో వారి తల్లులకు కూడా జీవనోపాధి కల్పించే సౌకర్యం కల్పించారు. వారి ఉపాధి కోసం చేనేత, అల్లికలు, రంగులు అద్దడం లాంటి వృత్తి శిక్షణను ఇస్తారు. ఇందుకోసం ఓ భవనం కేటాయించారు.

రెండేళ్ల కిందటే ఈ స్కూల్ నిర్మాణం పూర్తయింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ స్కూల్ భవనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఎడారి మధ్యలో వికసించిన పుష్పంలా భవనాన్ని అందంగా తీర్చిదిద్దారు. గాలి వెలుతురు సమృద్దిగా ప్రసరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శాండ్ స్టోన్ తో భవనం చుట్టూ మెష్ గోడలు నిర్మించడంతో భవనం లోపల ఏసీ వాతావరణాన్ని తలపిస్తాయి. దీంతో పిల్లలకు ఎలాంటి వేడి తాకదు. అంతటి థార్ ఎడారిలో ఏసీలో ఉండే ఇంతటి ప్రత్యేకత గల స్కూలు ఇప్పుడు వైరల్ అవుతోంది. దాని విశేషాలు తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలికల విద్య కోసం కొన్ని సంస్థలు చేసిన కృషి ఫలితాన్ని ఇచ్చింది. తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని వీళ్లు నిరూపించారు

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper