Dream Meaning: కలలు.. మనిషితో ముడిపడి ఉంటాయి.. మనిషి ఆలోచనల్లోంచి పుట్టుకొస్తాయి.. మన ఆలోచనలే కలలుగా మారి రాత్రిపూట వస్తాయి. అయితే కలలు మంచివైతే ఏం ఫర్వాలేదు. అదే ఈ కలలు మీకు వస్తే మాత్రం అరిష్టం. వాటి నుంచి మనం తక్షణం నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. స్వప్న శాస్త్రం ప్రకారం.. ఏదైన కల మన జీవితంలో వస్తే అది సంఘటనలతో ముడిపడి ఉంది. కలలు మంచి చెడూను సూచిస్తాయి. అలా కలల్లో ఇవి వస్తే అరిష్టంగా శాస్త్రం చెబుతోంది. కొన్ని నివారణ చర్యలు తీసుకుంటే వాటిని నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

-కలలో వరద లేదా.. మురికినీటిని చూస్తే అరిష్టంగా భావించారు. అలాగే సూర్యాస్తమయం చెడుగా పరిగణించాలి. ఈ కలలు మీ జీవితంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలకు సంకేతంగా భావిస్తారు.
-కలలో సముద్రాన్ని చూడడం చెడు శకునంగా భావించాలి. మీ మాటలను జాగ్రత్తగా మాట్లాడాలని సూచన. ఈ కల వస్తే ఎవరితోనైనా వాగ్వాదాన్ని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది.

-ఇక మీ కలలో గుర్రం నుంచి పడటం మంచిది కాదు.. అది మీ కెరీర్ లో ఇబ్బందికి సంకేతంగా సూచిస్తారు.
-కలలో పిల్లి, ఎండిన అడవి లేదా చెట్టును చూడడం మీ కెరీర్ లేదా వ్యాపారానికి మంచిది కాదు.
-ఇక కలలో కత్తెరను చూడడం కూడా మీ వివాహజీవితానికి.. సంబంధాలకు అరిష్టం. మీ ప్రేమ జీవితం, వైవాహిక జీవితం గందరగోళంలో పడబోతోందని అర్థం. ఇలాంటి టైంలో ఓపికగా మౌనంగా ఉండాలి.
-ఎత్తైన కొండలు, భవనాల నుంచి పడిపోతే ఉద్యోగం, వ్యాపారంలో నష్టాన్ని ప్రతిబింబిస్తాయి.
ఇలాంటి కలలు వస్తే వెంటనే తెల్లవారి శివాలయం వెళ్లి ప్రత్యేక పూజలు చేయాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే కలల దుష్ఫలితాల నుంచి నివారణ కలుగుతుంది.

గమనిక: పైన ఆర్టికల్ లోని సమాచారం కేవలం శాస్త్రాలు, జాతకాలు నమ్మేవారి కోసం పండితులు చెప్పినవే. వీటితో oktelugu.comకు ఎలాంటి సంబంధం లేదు. నమ్మడం.. నమ్మకపోవడం అనేది మీ ఇష్టం