Delhi Liquor Scam- KCR: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీకి అన్ని దిక్కుల నుంచి చుక్కలు కనిపిస్తున్నాయి. చంద్రికాక ఇచ్చిన హామీలపై అన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయని ఎప్పటికప్పుడు సర్వేల్లో బయటపడుతూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తైతక్క, హ్యాపీరావుపై ఈడీ ఎప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిస్తున్నా మాకేం తెల్వదు, మా జోలికి ఎవ్వరూ రాలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు కూతురు, హ్యాపీరావు.. సీఎం చంద్రికాక మునుగోడు బైపోల్ తోనే సతమతమవుతుంటే.. మధ్యలో ఈ లొల్లేందని తలకాయ పట్టుకుంటున్నడు చంద్రికాక.

అప్పుడు లిక్కర్.. ఇప్పుడు టికెట్ల లొల్లి..
ఆ స్కాం, ఈ స్కాం అని తేడా లేదు.. అన్ని స్కాంలు కల్వకుంట్ల ఫ్యామిలీకి కనెక్ట్ అవుతున్నాయి. నేషనల్ లెవల్ ఢిల్లీ లిక్కర్ స్కాంను రాష్ర్టానికి తెచ్చి పరువు తీసిండ్రు తైతక్క, హాపీరావు. ఈ కుటుంబమే ఇప్పుడు ఇంటర్ నేషనల్ లెవల్‌కు ఎదిగింది. ఏకంగా ఇండియా వర్సెస్ ఆస్ర్టేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం డ్రామారావు, తైతక్క చుట్టూ ముసుగుతంది. హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తే అయినా, టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కొందరు ఆయన పాలకమండలిలో ఉన్నారు. వీరి మధ్య వచ్చిన విభేదాలు టికెట్ల స్కాంను బయటకు పెట్టినయి. గతంలో హెచ్‌సీఏలో కల్వకుంట్ల అక్క తైతక్కకు కీలక పదవి అప్పగించాలని చంద్రికాక పెద్ద ఎత్తున ట్రై చేశాడనే టాక్ కూడా ఉంది. ప్రస్తుతం అది సైలెంట్ అయిపోయినా.. ఇటీవల క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అజారుద్దీన్ భేటి అనేక అనుమానాలకు తావిచ్చింది. తెల్లారితే ఇద్దరు లొల్లి పెట్టుకున్నా.. శ్రీనివాస్ గౌడ్ కాంప్లిమెంటరీ టికెట్లు అడిగిండని అజారుద్దీన్ చెప్పడం కాక కుర్చీ కింద మరింత మంటపెట్టింది.
కాక అనుకున్నదే అయ్యింది..
రాజకీయం చేయడంలో చంద్రికాకను మించినోడు లేడు.. పథకాలు తెచ్చుడు వాటిపైనే కోర్టుకెళ్లమని అనుచరులకు చెప్పుడు. ప్రతిపక్షమోళ్లు అడ్డుకున్నరని ప్రచారం చేసుడు. అప్పుడు హుజూరాబాద్ బైపోల్ ఉన్నదని ఆఘమేఘాల మీద దళిత బంధు తెచ్చిన కాక, ఇప్పడు మునుగోడు ఉన్నదని గిరిజన బంధు తెచ్చింది. అమలు చేస్తున్న చూడు అని జీవో కూడా తీసిండు. అది కాస్తా హైకోర్టులో తుస్సుమన్నది. జీవో సక్కగా లేదు.. ఈ జీవో పనికిరాదు.. కమిటీలు గిమిటీలు వద్దు.. దీనిపై ఏం పని చేయద్దు అని స్టే విధించింది. మళ్లీ వచ్చే నెల (అక్టోబర్ 21)కు వాయిదా వేసింది. అనుకున్నదే అయ్యిందని కాక సంబుర పడుతున్నా మునుగోడు బైపోల్ నోటిఫికేషన్ ఈ లోపు వస్తే బీజేపీపై నెట్టేసి పబ్బం గడపాలని చూస్తున్నాడు.

దేవుడే కాపాడాలె..
మునుగోడు బైపోల్ ను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన గిరిజన బంధు ఓట్లు కురిపిస్తదనుకున్న కేసీఆర్ కు కోర్టు ఆర్డర్ తో అమలుపై గిరిజనుల్లో అయోమయం నెలకొంది. ఎన్నికల స్టంటే అని మాకు తెలుసని గిరిజన నేతలు బాహాటంగానే చెప్తున్నారు. దళిత బంధు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింప చేస్తామని చెప్పిన కేసీఆర్ అరెకరమున్నా గిరిజనులకు గిరిజన బంధు ఎందుకు వర్తింప జేయరని గుస్సవుతున్నరు. ప్రతి ఒక్క గిరిజనుడికి పథకం వర్తింప జేయాలని లేకుంటే మా సత్తా ఏంటో చూపుతామని మండిపడుతున్నారు.
ఏదేమైనా చంద్రికాక మునుగోడు బైపోల్ గట్టెక్కడం జరిగే పని కాదని, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ స్కాంలు, కోర్టు స్టేలు ఇవన్నీ చూస్తుంటే ఆయనను ప్రజలు నమ్మే పరిస్థితి లేదనిపిస్తున్నది.