BJP MLA Raja Singh: రాజాసింగ్ కరుడుగట్టిన హిందూ వాది. తనలో నరనరాన హిందూ రక్తమే ప్రహిస్తోందని, ముస్లింలకు తాను పూర్తి వ్యతిరేకినని ప్రకటించుకున్నారు కూడా. రాజకీయంగా బీజేపీలో ఉన్నప్పటికీ హిందుత్వమే ఎజెండాగా పనిచేస్తుంటారు ఈ గోషామహల్ ఎమ్మెల్యే. అయితే ఇటీవల ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో రాజకీయ దుమారం లేపింది. నుపుర్‌శర్మ ఉదంతం తర్వాత ఇలాంటి వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉంటున్న బీజేపీ అధిష్టానం, రాజాసింగ్ వీడియో విడుదల చేయడాన్ని కూడా తప్పు పట్టింది. వెంటనే ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగింపజేయడమే కాకుండా రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాజాసింగ్ ఉదంతం ఎవరికి లబ్ధి అనే చర్చ జరుగుతోంది.

-హిందుత్వ పార్టీ అయినా..
బీజేపీ కూడా హిందుత్వ పార్టీ. అయినప్పటికీ మతపరమైన దూషణలను పార్టీ వ్యతిరేకిస్తోంది. నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలతో భారత్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. భారత మిత్ర దేశాలు కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యలను ఖండించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై తప్పనిసరి పరిస్థితితో చర్యలకు దిగింది. రాజాసింగ్ వీడియో, ఆయన చేసిన వ్యాఖ్యలు తమకు కలిసి వస్తాయని బీజేపీకి తెలుసు. కానీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కాం విషయం బయటపెట్టిన నేపథ్యంలో రాజాసింగ్ ఇస్లాం వ్యతిరేక వీడియో విడుదల చేయడం బీజేపీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే వేటు వేసింది. అయితే తాజాగా రాజాసింగ్ వ్యాఖ్యలను ఇప్పుడు తమకు ఎలా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.
Also Read: Taj Mahal Renamed: తాజ్ మహల్ పేరు మారబోతోందా?
-టీఆర్‌ఎస్ చర్యలే బీజేపీకి లబ్ధి..
ఇక రాజీసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల అంబేద్కర్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఖండిచారు. మతపరంగా ఏ దేవుడు కొట్టుకోమన్నాడని ప్రశ్నించారు. ఇక సీఎం కేసీఆర్ ఇటీవల నిర్వహిస్తున్న సభలో మంటలు కావాలా, పంటలు కావాలా? నిజమే ఈ ప్రశ్నలు మంచివే కావొచ్చు.. అని ప్రశ్నించారు. బీజేపీని మతపరమైన పార్టీగా ఒకవేలితో చూపుతున్న టీఆర్‌ఎస్ నేతలు మిగతా నాలుగు వేళ్లు తమవైపు ఉన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ముస్లిం పార్టీగా గుర్తింపు ఉన్న ఎంఐఎంతో అంటకాగడమే ఇందుకు నిదర్శనం. బీజేపీ మతపరమైన పార్టీగా చిత్రీకరించేందకు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ మతపరమైన పార్టీ అయినప్పుడు ఎంఐఎం లౌకిక పార్టీ ఎలా అవుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
-తండ్రేమో దోస్తీ అంటాడు.. తనయుడేమో కాదంటాడు..
ఎంఐఎం విషయంలో టీఆర్‌ఎస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఎంఐఎం పార్టీ తమ మిత్రపక్షమని చాలాసార్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడులో నిర్వహించిన సభలోనూ బీజేపీపై ఎదురు దాడిచేస్తున్న సందర్భంగా ఎంఐఎం తమ మిత్రపక్షమని ప్రకటించారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే అందుటో 103 సీట్లు టీఆర్‌ఎస్‌కు ఉన్నాయని, మరో ఏడు సీట్లు తమ మిత్రపక్షానికి ఉన్నాయని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ తనయుడు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎంఐఎం తమ మిత్రపక్షం కాదని ప్రకటించాడు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయలో ఎంఐఎం తమకు మిత్రపక్షమే కాదని, పాత బస్తీలో కూడా తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టామని తెలిపారు. పార్టీ నేతల్లో కూడా కొంతమంది ఎంఐఎంకు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. తండ్రీ కొడుకుల మధ్యనే భిన్నాభిప్రాయం ఉన్న నేపథ్యంలో పార్టీలో ఈ భావన ఉండడం సహజమే.

-అక్బరుద్దీన్‌కు పరోక్ష సహకారం..
ఇక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హిందూ దేవతలను దూషించిన విషయంలో కోర్టు చొరవతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీఆర్‌ఎస్ సర్కార్ ఒత్తిడితో చార్జిషీట్ దాఖలుకు ఏళ్ల తరబడి జాప్యం చేశారు. ప్రభుత్వం తరఫున వాదనలనూ సక్రమంగా వినిపించలేదు. దీంతో అక్బరుద్దీన్ హిందూ దేవతలను దూషించిన విషయంలో నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఈ విషయాలనూ ప్రజలు గమనించారు. ఈ నేపథ్యలో టీఆర్‌ఎస్ నేతలు తమది, ఎంఐఎంది లౌకిక వాదమని, బీజేపీది మదతావమని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
-అనుకూల మీడియాలో రాజాసింగ్ అనుకూల కథనాలు..
ఇక రాజాసింగ్ వ్యాఖ్యలతో ఎలా లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీ తమ అనుకూల మీడియాలో డిబేట్ నిర్వహించడం, కథనాలు ప్రసారం చేయడం ద్వారా పాజిటివ్ దృక్పథం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రాజాసింగ్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తోంది. ఇక అంబానీల మీడియా ఫస్ట్ పోస్టులో బీజేపీ అనుకూల విశ్లేషణలు ప్రారంభించింది. ఇందులో ఇస్లాంపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేస్తే తనను జైల్లో పెట్టారని.. తప్పు చేస్తే నరకాలని.. కానీ హిందువులకు వ్యతిరేకంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వారు బయట ఉండడాన్ని రాజాసింగ్ తప్పు పట్టారు. దీనిని రాజాసింగ్ తెలివిగా ఎంఐఎం సమస్యగా చిత్రీకరించడం ద్వారా టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ‘తల నరికివేయాలి’ లాంటి నినాదాలు ఉన్మాదానికి దారితీస్తాయి. ఇరాన్ నేత ఇచ్చిన పిలుపు మేరకు రచయిత సల్మాన్‌రష్డీపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. పిలుపు ఇచ్చిన వారు ఆ పని చేయకపోయినా దాని ప్రభావం ఉన్మాదులపై ఉంటుంది. ఈ నేపథ్యలో పిలుపు ఇచ్చినవారిని టీఆర్‌ఎస్ అరెస్ట్ చేయడం లేదన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నాయకులు యత్నిస్తున్నారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌ను దోషిగా నిలబెట్టి.. లబ్ధి పొందాలని కమలనాథులు చూస్తున్నారు.
Also Read: Samantha: సమంత గర్భం తొలగించుకుంది?… ఇప్పుడిదే హాట్ టాపిక్!
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ