Chiranjeevi- Nagababu: జీవితంలో ఎవరికైన వ్యక్తిగత అనుభవాలు గమ్మత్తుగా ఉంటాయి. ఎంత పెద్ద వ్యక్తి అయినా తనకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉండటం సహజమే. అందులో జరిగిన సంఘటనలే విస్తుగొలుపుతాయి. ఒక్కోసారి గుర్తుకొస్తే భలే నవ్వొస్తుంటుంది. అలాంటి సంఘటనలు ఎవరికైనా ప్రత్యేకమే అని చెప్పాలి. ఎంతటి సెలబ్రిటీ అయినా వారి జీవితంలో ఉన్న పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. వాటిని తలుచుకుని పలుమార్లు నవ్వుకున్న సందర్భాలు సైతం ఉంటాయి. అలాంటి వ్యక్తిగత జీవితంలో ఓ స్టార్ హీరోకు ఎదురైన అనుభవం చూస్తే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది.

సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజీ ఎలాంటిదో తెలిసిందే. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఎంతో ఎదిగిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఆధారం లేకున్నా స్వయంకృషితో మెగాస్టార్ గా మారిన ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పరిశ్రమలోకి ఎందరో అడుగుపెట్టారు. చిరంజీవికి కూడా చిన్న నాటి ఓ సంగతి బాధ కలిగించిన విషయం బయటపెట్టి అందరిలో ఆశ్చర్యాన్ని నింపారు. తన చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ శ్రీజ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించిన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో యాంకర్ సుమ చిరంజీవిని చిన్ననాటి గుర్తులను చెప్పాల్సిందిగా కోరడంతో తన చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన రాము అనే సినిమాకు తాను తమ్ముడు నాగబాబు ఇద్దరం ఫస్ట్ షో చూడాలని వెళ్లాం. కానీ అప్పటికే మా అమ్మానాన్న సినిమా చూసి బయటకు వస్తుంటే చూడటంతో భయం పట్టుకుంది.

ఇంటికొచ్చాక నాన్న కొడుతున్న దెబ్బలకు విలవిలలాడాం. సినిమాకు పోయినందుకు కాదు నేల టికెట్ కొన్నందుకు నాన్న కోపానికి వచ్చారు. ఎంతైనా చిన్నప్పుడు జరిగే విషయాలు భలే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు తలుచుకుంటే ఓ పక్క నవ్వు మరో పక్క బాధ కలుగుతాయి అని తన మనసులోని మాట వెల్లడించారు. ఇప్పుడు ఈ విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
[…] […]
[…] […]