Taj Mahal Renamed: ప్రపంచానికే ప్రేమ పాఠాలు నేర్పుతోంది మన ‘తాజ్ మహల్’. మన చక్రవర్తి షాజహాన్ ప్రేమకు నిలువెత్తు రూపమైన ‘తాజ్ మహల్’ ప్రపంచ వింతల్లో ఒకటి. ఎందుకంటే ఇది మొత్తం పాలరాతితో కట్టారు. చంద్రుడి వెలుగులో ధగధగ మెరిసిపోతుంది. అంతటి తాజ్ మహల్ పేరును మార్చబోతున్నారట.. మన ఘనత వహించిన బీజేపీ పెద్దలు కొందరు ఈ మాట అన్నారు.

తాజ్ మహల్ పేరును ‘తేజో మహాలయ’గా మార్చాలని బీజేపీ కౌన్సిలర్ ‘శోభారామ్ రాథోడ్’ ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని బుధవారం తాజ్ మహల్ ఉన్న ఆగ్రా మున్సిపాలిటీలో సమర్పిస్తారు. దీనిపై నగర పాలక సంస్థ సభ్యుతు తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
Also Read: BJP- Pawan Kalyan: బీజేపీకి అనుమాన ‘పవనా’లు.. అందుకే ఇతర సినీ స్టార్స్‌వైపు చూపు
తాజ్ మహల్ లో కమలంతో కూడిన కలశం ఉన్నట్లు రుజువులు తన వద్ద ఉన్నాయని శోభారాం రాథోడ్ తన ప్రతిపాదనలో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. తాజ్ మహల్ లో తాళాలు వేసి ఉన్న 22 గదులను తెరవాలని కొన్ని నెలల క్రితం అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది.

ఇక తాజ్ మహల్ ఒకప్పుడు ఓ శివాలయం అని.. ఇదే విషయాన్ని ప్రాచీన గ్రంథాలు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు చెబుతున్నాయని కొందరు వాదిస్తున్నారు.
ఇక యూపీలోని యోగి ప్రభుత్వం ‘తాజ్ మహల్’ను రామ్ మహల్ గా మార్చుతుందని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ అనడం సంచలనమైంది. ఆ దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అని వీరి మాటలను బట్టి తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
[…] Also Read: Taj Mahal Renamed: తాజ్ మహల్ పేరు మారబోతోందా? […]
[…] Also Read:Taj Mahal Renamed: తాజ్ మహల్ పేరు మారబోతోందా? […]