కరోనా వైరస్ కారణంగా పవన్ కళ్యాణ్ కి పెద్ద చిక్కొచ్చి పడింది. ఆయన ప్రణాళిక మొత్తం తారుమారైంది. రాజకీయాలలో సీరియస్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్థిక అవసరాల కోసం తప్పలేదని ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రత్యర్ధులు దీన్ని ఆసరాగా చేసుకొని కొన్నాళ్లు విమర్శలు చేశారు. ముఖ్యంగా వైసీపీ నేతలు పవన్ సినిమా జోలికి వెళ్లనని చెప్పి మాట తప్పారని అన్నారు. ప్రజా సేవకే జీవితం అంకితమన్న… పవన్ ముఖానికి రంగేసుకుని..పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని నిరూపించుకున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ నిర్ణయం వలన సొంత పార్టీ నేతలలోనే వ్యతిరేకత చెలరేగింది. పవన్ సినిమాలు ఒప్పుకోవడాన్ని సాకుగా చూపి మాజీ డీజీపీ లక్ష్మీ నారాయణ పార్టీ నుండి బయటికి వెళ్లిపోయారు.
చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?
ఎవరెళ్ళిపోయినా పార్టీని నడపగల సత్తా మాకుందని తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు పవన్. సినిమాల ద్వారా భారీ ఎత్తున నిధుల సేకరణకు పూనుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పుకున్నారు. అధికారికంగా ప్రకటించిన ఈ మూడు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలు పూర్తి చేయాలన్నది పవన్ ఆలోచన. ఐతే కరోనా వైరస్ వలన ఏర్పడిన పరిస్థితులు పవన్ ప్రణాళికలను తారుమారు చేశాయి. 2024 ఎన్నికలలోపు మరో రెండు చిత్రాలు చేయడం అటుంచితే…ఒప్పుకున్న మూడు చిత్రాలు పూర్తి చేయడమే కష్టమనే మాట వినిపిస్తుంది. వకీల్ సాబ్ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చినప్పటికీ మరో 20రోజుల షూటింగ్ మిగిలివుంది.
చంద్రబాబుకి పచ్చకామెర్లు.. పవన్ కి కాదు!
దర్శకుడు క్రిష్ తో చేస్తున్న భారీ పీరియాడిక్ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం కావాలి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ మూవీ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చి సవ్యంగా షూటింగ్ జరిగిన తరుణంలో, 2022 కి పవన్ కమిటైన మూడు చిత్రాలు పూర్తి చేయగలడు. సాధారణ పరిస్థితులు ఏర్పడడానికి మరింత సమయం పట్టే నేపథ్యంలో పవన్ కి ఆ చిత్రాలు పూర్తి చేయడానికి 2023వరకు సమయం పడుతుంది. ఈ విషయమే పవన్ లో గుబులు రేపుతుంది.
పవన్ పార్టీ పెట్టి ఆరేళ్ళు అవుతున్నా సంస్థాగతంగా, క్షేత్ర స్థాయిలో బలపడలేదు. జనసేన బలమైన రాజకీయ పార్టీగా, ఇతర పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా ప్రజలు భావించడం లేదు. గత ఎన్నికలలో కనీసం 175 మంది అభ్యర్థులను పోటీకి దింపలేకపోయారు. 2024 ఎన్నికలకు జనసేన సన్నద్ధం కావాలంటే కనీసం రెండేళ్ల ముందు నుండే పవన్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలి. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికి ఆయనకు రెండేళ్లకు పైగా సమయం పడితే… ఆయన ఇంకెప్పుడు పార్టీని పటిష్టం చేసి, ఎన్నికలకు సిద్ధం అవుతాడు?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Pawan kalyans political plan is a total waste
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com