Homeఆంధ్రప్రదేశ్‌Pranay case : ప్రణయ్ పరువు హత్య కేసు..  నేడు కీలక పరిణామం

Pranay case : ప్రణయ్ పరువు హత్య కేసు..  నేడు కీలక పరిణామం

Pranay Honor killing: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ(Nalgonda)జిల్లా రెండో అదనపు సెషన్స్‌ కోర్టు మరియు ఎస్సీ/ఎస్టీ కోర్టు తుది తీర్పును వెలువరించనుంది. 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో జరిగిన ఈ హత్య కేసులో పెరుమాళ్ల ప్రణయ్‌(Perumalla Pranay)ను అతని భార్య అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన కులాంతర వివాహం చేసుకున్నందుకు పరువు హత్యగా జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిపై నిందితులుగా కేసు నమోదైంది. ప్రధాన నిందితుడు మారుతీరావు (అ1) 2020 మార్చి 7న ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన నిందితులుసుభాష్‌ శర్మ (అ2), అస్గర్‌ అలీ (అ3), అబ్దుల్‌ బారీ (అ4), ఎంఏ కరీం (అ 5), శ్రవణ్‌ కుమార్‌ (అ6), శివ (అ7), నదీమ్‌ (అ 8)పై విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు, సాక్ష్యాలు, ఆధారాల సమర్పణ పూర్తయిన తర్వాత, కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది.
ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఫిర్యాదు..
ప్రణయ్‌ హత్యపై అతని తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య), 120బీ (కుట్ర), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. 2019 జూన్‌ 12న 1600 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేయగా, సాంకేతిక ఆధారాలు, సాక్షుల విచారణ ఆధారంగా విచారణ కొనసాగింది. ఈ కేసు తీర్పుపై ప్రణయ్‌ కుటుంబం, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పరువు హత్యల నేపథ్యం..
పరువు హత్యలు (Honor Killings) అనేవి సామాజిక, సాంస్కృతిక కారణాలతో కుటుంబ సభ్యులు లేదా సమాజ సభ్యులచే జరిగే హత్యలు, ఇవి సాధారణంగా కుటుంబం లేదా సమాజం యొక్క ‘పరువు‘ లేదా ‘గౌరవాన్ని‘ కాపాడే ఉద్దేశ్యంతో నిర్వహించబడతాయి. భారతదేశంలో ఈ హత్యలు తరచుగా కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు, లేదా సమాజం ఆమోదించని సంబంధాల వల్ల సంభవిస్తాయి. ఇటువంటి ఘటనలు సాంప్రదాయ విలువలు, కుల వ్యవస్థ, మరియు పితృస్వామ్య ఆలోచనలతో లోతుగా ముడిపడి ఉంటాయి.
కులాంతర వివాహాలు: భారతదేశంలో వివిధ కులాల మధ్య వివాహాలు జరిగినప్పుడు, ముఖ్యంగా దళితులు లేదా తక్కువ కులంగా భావించబడే వారితో ఉన్నత కులాల వారు వివాహం చేసుకుంటే, కుటుంబం ‘పరువు తగ్గింది‘ అని భావించి హత్యలకు పాల్పడతారు. ప్రణయ్‌ హత్య కేసు ఇందుకు ఒక ఉదాహరణ.
ప్రేమ వివాహాలు: తల్లిదండ్రులు లేదా సమాజం ఆమోదించని ప్రేమ సంబంధాలు కూడా ఇటువంటి హత్యలకు దారితీస్తాయి.
భారతదేశంలో పరువు హత్యలు
గణాంకాలు: ఖచ్చితమైన లెక్కలు లేనప్పటికీ, నేషనల్‌ క్రై మ్‌ రికార్డ్స్‌ బ్యూరో (Nఇఖఆ) ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం వందల కేసులు నమోదవుతాయి. అయితే, చాలా ఘటనలు నమోదు కాకపోవడం లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించబడటం జరుగుతుంది.
ప్రాంతాలు: ఉత్తర భారతదేశంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో ఖాప్‌ పంచాయతీలు ఇటువంటి హత్యలకు ప్రోత్సాహం ఇస్తాయి. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా కుల ఆధారిత పరువు హత్యలు జరుగుతాయి.
ఉదాహరణలు: 
ప్రణయ్‌ హత్య (2018): తెలంగాణలో అమృత–ప్రణయ్‌ కులాంతర వివాహం కారణంగా జరిగిన హత్య.
శంకర్‌ హత్య (2016): తమిళనాడులో కావేరి–శంకర్‌ వివాహం కుల వ్యతిరేకత వల్ల హత్యకు దారితీసింది.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular