Pithapuram Varma : పిఠాపురం వర్మకు( Pithapuram Varma ) షాక్ ఇచ్చారు చంద్రబాబు. మరోసారి ఆయన త్యాగానికి ఫలితం దక్కలేదు. దీంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు పిఠాపురం వర్మ. పవన్ కళ్యాణ్ కోసం ఆయన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టికెట్ వదులుకున్నారు. అయితే ఆయన త్యాగానికి తగ్గ ఫలితం దక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎమ్మెల్సీ పదవి నీదేనంటూ హామీ ఇచ్చారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది సమీపిస్తోంది. కానీ ఇంతవరకు పిఠాపురం వర్మకు పిలుపు లేదు. పదవి కేటాయింపు లేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా విభిన్న ప్రకటనలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Also Read : కష్టపడి గెలిస్తేనే అది విజయం.. పవన్ కళ్యాణ్ పై వర్మ సంచలన ట్వీట్!
* మంచి పట్టున్న నేత
పిఠాపురం నియోజకవర్గంపై పట్టున్న నాయకుడు వర్మ( Varma) . సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో స్థానిక సమీకరణల దృష్ట్యా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి టిడిపి అభ్యర్థి పై గెలిచిన చరిత్ర ఆయనది. అటు తర్వాత టిడిపిలో చేరి తన ముద్ర చాటుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి టికెట్ దక్కించుకున్నారు. ఓడిపోయిన సరే.. గత ఐదేళ్లపాటు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో పోటీకి అన్ని విధాలా సిద్ధపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ రూపంలో చివరి నిమిషంలో టికెట్ దక్కకుండా పోయింది. అయినా సరే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు.
* అనుచరుల్లో అసంతృప్తి
అయితే 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయేసరికి అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి రేగింది. 2014 ఎన్నికలు మాదిరిగా ఇండిపెండెంట్ గా( independent )పోటీ చేయాలని వారు కోరారు. అయితే అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో వెనక్కి తగ్గారు వర్మ. పవన్ గెలుపు కోసం కృషి చేశారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మ విషయంలో గౌరవభావంతో చూసుకున్నారు. దీంతో ఎటువంటి కల్మషం లేకుండా వర్మ పని చేశారు. అయితే పవన్ గెలిచిన తర్వాత వర్మను పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ వినిపించాయి. ఒకవైపు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ నిలబెట్టుకోలేకపోవడం, మరోవైపు పిఠాపురంలో జనసైనికులు వర్మను పట్టించుకోకపోవడం, అంతటితో ఆగకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుండడం వంటి కారణాలతో తీవ్ర అసహనంతో ఉన్నారు వర్మ.
* హై కమాండ్ నుంచి ఫోను
ప్రస్తుతం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం( Telugu Desam). బీద రవిచంద్ర, బిటి నాయుడు, కావలి గ్రీష్మ ప్రసాద్ పేర్లు ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. అయితే అప్పటికే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిఠాపురం వర్మకు ఫోన్ చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని.. సమీకరణల దృష్ట్యా ఈసారి ఛాన్స్ ఇవ్వలేకపోయారని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మెత్తబడిన వర్మ.. తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది.
Also Read : అజ్ఞాతంలో బోరుగడ్డ.. ఇంకా ఎన్నాళ్లు ఉంటాడో.. ఎందుకంటే..