Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా నిధులను సమీకరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15 వేల కోట్ల రూపాయలను రుణంగా సర్దుబాటు చేసింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో మరో 15 వేల కోట్లు సమీకరించగలిగింది. వీటితో ముందుగా పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని చూస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే గతంలో ఇచ్చిన అనుమతులు, టెండర్లను సవరించి కొత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. దీంతో అమరావతి నిర్మాణం పై క్రమంగా క్లారిటీ వస్తోంది. మరోవైపు శాసనసభలో సైతం మున్సిపల్ శాఖ మంత్రి, అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న నారాయణ కీలక ప్రకటన చేశారు. బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నపై మాట్లాడిన మంత్రి నారాయణ అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Also Read : అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే పనులు!
* కూటమి రాకతో కళ
ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్లుగా అమరావతిపై నిర్లక్ష్యం కొనసాగింది. ముఖ్యంగా 35 వేల ఎకరాల అమరావతి స్థలాల్లో.. నిర్వహణ లేక చిరు అడవిలో మారిపోయింది. దాదాపు 33 కోట్ల రూపాయలతో ఆ భూమిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాల్సి వచ్చింది. అటు నిపుణుల సూచన మేరకు అదే నిర్మాణాలను కొనసాగించవచ్చని స్పష్టమైంది. దీంతో పాత టెండర్లను పునః సమీక్షిస్తూ.. కొత్త వాటికి అనుమతులు మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే మారిన అంచనాల నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ. 64,721 కోట్లుగా తీర్చినట్లు మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
* నిధుల సమీకరణ పై క్లారిటీ
అయితే ఇప్పటివరకు నిధుల సమీకరణకు సంబంధించి అనేక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. కానీ అమరావతికి( Amaravathi ) ఖర్చు చేయబోయే నిధులపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. బహుళపక్ష ఏజెన్సీలు, బ్యాంకుల నుంచి లోన్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు పొందడం ద్వారా నిధుల సేకరణ చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను దశలవారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2019 నుంచి 2024 మధ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పనుల్లో జాప్యం చేసిందని.. ఇకనుంచి పరుగులు పెట్టిస్తామని మంత్రి నారాయణ శాసనసభా వేదికగా ప్రకటించారు.
* విస్పష్ట ప్రకటన
అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్. వీలైనంత త్వరగా నిధులు సమీకరించి పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రజలకు సంకేతాలు పంపింది. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం లేదు. అయితే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ అభిప్రాయాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
Also Read : బొత్స స్మశానం కామెంట్స్.. అమరావతి రైతు ఫిర్యాదు!