Home Blog Page 8675

ఇడి కేసునుంచి జగన్ కి విముక్తి

జగన్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఇ డి అప్పలేట్ ట్రిబ్యునల్ పెన్నా సిమెంట్ కేసులో ఇ డి అధికారుల్ని తప్పుపట్టింది. ముందుగా పెన్నా సిమెంట్ కంపెనీ 1.1 కోట్ల రూపాయల లబ్ది కోసం సాక్షి పేపర్లో 45 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టటం ఏవిధంగానూ తర్కానికి నిలబడటంలేదని, హాస్యాస్పదంగా ఉందని చెప్పింది. సాక్షి పత్రిక రెండో అత్యధిక సర్క్యూలేషన్ గల పత్రికా ఉండటం ఈ పెట్టుబడులు వ్యాపార దక్షతకు సాక్ష్యంగా ఉన్నాయని తీర్పు చెప్పింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఏమీ దైవదత్తం కాదని, ఆరోపణలు నిరూపణ కాకముందే దానిని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించింది. అసలు ఇందులో అక్రమ నగదు చలామణి కి సంబంధించి ఏముందని అడిగింది. సిబిఐ ఛార్జ్ షీట్ ని మక్కి కి మక్కి కాపీ కొట్టటం తప్పిస్తే ఈడీ కి సంబంధించి ఇందులో ఏమీ కనిపించలేదని చెప్పింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కి పెద్ద ఉపశమనమే. ఇది రాబోయే పరిణామాలకు సంకేతమా?

జగన్ మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యినతర్వాత దర్యాప్తు సంస్థల్లో వచ్చిన మార్పుకి ఇది సంకేతంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇది రాబోయే తీర్పులకు ముందు సూచికగా అని అనుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి మీద ఇప్పటికే చాలా కేసులు పెండింగు లో వున్నాయి. ముఖ్యమంత్రి అయ్యిన తర్వాత ప్రత్యక్షంగా కోర్టు హాజరునుంచి మినహాయింపు కోరుతున్నాడు. అందుకు కోర్టులు ఆమోదం తెలుపుతున్నాయి. అయితే తన మీదున్న కొన్ని కేసుల్లో సాక్ష్యాలు బలంగా వున్నాయి. అదీగాక ఇందులో కొన్ని ఇప్పటికే చివరిదశకు చేరాయి. ఈ సమయంలో ఆరోపణలు నిరూపణ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అనుకుంటున్నారు. వచ్చే రోజుల్లో ఈ పరిణామాలు ప్రధానం కాబోతున్నాయి. ఓ విధంగా జగన్ మోహన రెడ్డి కి ఇది పెద్ద అగ్నిపరీక్షే.

బొల్లినేని కి ఉచ్చు బిగిస్తుంది

 

బొల్లినేని శ్రీనివాస గాంధీ కేసులో మరిన్ని నిజాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్ ఇడి ఆఫీసులోనే రాజకీయ పెద్దల పలుకుబడితో ఎక్కువకాలం పనిచేశాడు. ఆ టైములో తన అధికారానికి మించి పెత్తనం చెలాయించాడు. సంయుక్త కార్యదర్శి అధికారాలు కూడా తనే చేసేవాడు. కీలకమైన కేసులు తన దగ్గరే అట్టిపెట్టుకోవటమే కాకుండా మిగతా కేసులు కూడా ఎవరికివ్వాలో సంయుక్త కార్యదర్శికి బదులు తనే చేసేవాడు. ఇప్పుడు తన నిర్వాకాలన్నీ ఒక్కొక్కటీ బయటకొస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆంతరంగిక సమాచారాన్ని తనకు అనుకూలమైన, తన వర్గానికి చెందిన వ్యక్తులకు చేరవేసేవాడని ఆధారాలు దొరికినట్లు తెలుస్తుంది.

సుజనా చౌదరి కి చెందిన కేసుల్లో తనకు గాంధీ ద్వారా ముందస్తు సమాచారం ఎప్పటికప్పుడు చేరేది. ఇటీవల జీఎస్టీ ఇన్ పుట్ క్రెడిట్ తప్పుడు బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసిన వ్యవహారంలో కూడా సుజనా చౌదరికి ముందస్తు సమాచారం ఉన్నట్లు తెలిసింది. తన మోడస్ ఆపరెండి లో ఇంకో వ్యవహారం బయటకు వచ్చింది. తన వర్గానికి, కావాల్సిన వాళ్లకు సంబంధించిన కేసుల్లో తప్పనిపరిస్థితుల్లో కేసులు బుక్ చేసి సీరియస్ ఛార్జీలకు బదులు చిన్న చిన్న చార్జీలు పెట్టి కేసుల్లోనుంచి బయట పడేసేవాడు. ఇవన్నీ ఇప్పుడు బయటకొచ్చి తన మెడకు వుచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ముందుగా గాంధీని జీఎస్టీ నుండి బదిలీ చేశారు. ఆ తర్వాత వీటన్నింటిపై దర్యాప్తు జరుపుతారని తెలిసింది.

గాంధీ భార్య శిరీష పై కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆవిడ ఐటీ రిటర్న్ లో కన్సల్టెన్సీ ద్వారా ఆదాయం వచ్చినట్లు చూపించటం జరిగింది. ఆ ఫర్మ్ కస్టమ్స్, ఎక్సయిజ్ విశ్రాంతి ఉద్యోగులతో స్థాపించి నిందితులకు సలహాలిస్తూ సమాచారం చేరవేస్తూ వచ్చింది అందులో డైరెక్టర్ గా వున్న శిరీషనేనని తెలుస్తుంది. దీనిపై కూడా సిబిఐ దర్యాప్తు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ముందు ముందు ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తాయో వేచిచూద్దాం

.

గాంధీ పై దర్యాప్తు భవిష్యత్తు పరిణామాలకు సంకేతమా?

 

సిబిఐ దర్యాప్తులో భాగంగా కేంద్ర జీఎస్టీ లో అధికారయిన బొలినేని శ్రీనివాస గాంధీ ఆస్తులపై దాడి చేయటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఇటీవల మోడీ 2. 0 అధికారం చేపట్టిన తర్వాత సిబిఐ దేశ వ్యాప్తంగా దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఇదే స్పీడు లో త్వరలో గాంధీ కుటుంబం పై కూడా దర్యాప్తు వేగవంతం కావచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా ఆగస్తా వెస్ట్ ల్యాండ్ కి సంబంధించి దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిందనుకుంటున్నారు. అలాగే రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలకు సంబంధించి కూడా సాక్ష్యాలు బలంగా ఉన్నట్లు తెలుస్తుంది. చిదంబరం , కార్తీ చిదంబరం ల కేసులు కూడా ఓ కొలిక్కి రావచ్చు. ఇటీవలే ఇంద్రాణి అప్రూవర్ గా మారింది. ఈ వేగం ఇలానే కొనసాగితే త్వరలో సంచలన వార్తలు వినే అవకాశం వుంది.

ఇది ఇలావుంటే బొలినేని శ్రీనివాస గాంధీ విషయంలో జగన్ వర్గీయులు చాలా సంతోషంగా వున్నారు. జగన్ పై కేసులు నమోదు చేసి వెంటపడిన దాంట్లో ఈ అధికారి పాత్ర ఎక్కువగా ఉందని చెపుతున్నారు. ఇప్పటికి బయటపడిన ఆస్తులే మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్ల రూపాయలు వుంటాయని అనుకుంటున్నారు. ఇతను చంద్రబాబు నాయుడు కి అతి సన్నిహితుడని కూడా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒత్తిడి తోనే జగన్ ని వెంటాడని జగన్ వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో ఒకరోజు చంద్రబాబు నాయుడు మీదకూడా ఉచ్చు బిగిస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం పై నివేదిక తెప్పించుకొని ప్రస్తుత కాంట్రాక్టర్ ని తొలగించ బోతున్నారని వార్తలు వచ్చాయి. మిగతా వాటిల్లో కూడా చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయం లో మోడీ కి, జగన్ కి , కెసిఆర్ కి వుమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు నే.

ఇది ముందుగానే పసిగట్టిన చంద్రబాబు నాయుడు తనకు విశ్వాసపాత్రులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లను బీజేపీ లోకి పంపించాడని జనం బలంగా నమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదుకానీ చంద్రబాబు కి ముందు ముందు కష్టాలు ఖాయం. బొలినేని శ్రీనివాస గాంధీ కేసు రాబోయే పరిణామాలకు సంకేతమని భావిస్తున్నారు.

రామ్ మాధవ్ కి తానా సభల్లో అవమానం

 

రామ్ మాధవ్ బీజేపీ లో కీలకనేత. ఎక్కడ సమస్యవున్నా పార్టీ తన సేవల్ని ఉపయోగించుకుంటుంది. కాశ్మీర్లో ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, పిడిపి ఇటు జమ్మూలో ,అటు లోయలో పెద్ద పార్టీలుగా అవతరిస్తే పార్టీ రామ్ మాధవ్ ని పంపించి బద్దవిరోధులైన రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరిచింది. అలాగే ఈశాన్య ప్రభుత్వం లో ఏ సమస్య వచ్చినా రామ్ మాధవ్ వెళ్లి పరిష్కరిస్తారు. అంతటి ప్రాముఖ్యత వున్న నేత రామ్ మాధవ్. అక్షరాలా కోనసీమ గర్వపడేలా దేశంలో ఓ పెద్దనేతగా మన తెలుగు నేలకు సంబందించిన వ్యక్తి వున్నత స్థానంలోకి వెళ్ళటం తెలుగు వాళ్లందరికీ సంతోషం. అయితే రామ్ మాధవ్ పై నెగటివ్ గా కూడా ఇమేజ్ వుంది. తెరచాటు వెనుక రాజకీయాలు చేయటంలో ఆరితేరిన వ్యక్తిగా పేరు రావటం తన వ్యక్తిత్వానికి మచ్చ గానే చెప్పాలి.

ఇటీవల రామ్ మాధవ్ ని తానా సభలకు వాషింగ్టన్ కి ఆహ్వానించారు. తెలుగు వాళ్లలో పేరు ప్రఖ్యాతులు వున్న వ్యక్తిగా రామ్ మాధవ్ ని ఆహ్వానించారు. అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికినట్లు తెలిసింది. అదే రామ్ మాధవ్ విషయంలో నిర్వాహకులు స్వాగతం పలికినా తాను మాట్లాడేటప్పుడు సభలో నిరసన తెలిపారు. సభలకు హాజరైన సభ్యులు రామ్ మాధవ్ విషయంలో అంత సద్భావన లేకపోవటమే ఇందుకు కారణం. తానా సభ్యులు ఇక్కడ ఆంధ్రా రాజకీయాలకు ఎక్కువగా ప్రభావితమవుతారు. అందరూ అనుకుంటున్నట్లు గానే కమ్మ సామాజిక వర్గం వ్యక్తుల ప్రభావం ఈ సంఘంలో ఎక్కువగా వుంటుందనే విషయం ఇప్పుడు రుజువయ్యింది. రామ్ మాధవ్ తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు పై ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఒకసారి సభకు ఆహ్వానించిన తర్వాత మర్యాదగా చూసుకొని పంపించాల్సిన భాద్యత నిర్వాహకులూ, సభ్యులపై ఉంటుంది. సభకు పిలిచి అవమానించటం మర్యాద అనిపించుకోదు. సహజంగా ఏ నాయకుడిని పిలిచినా గౌరవించి పంపిస్తుంటారు. కానీ రామ్ మాధవ్ విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఆంధ్రాలో, తెలుగు దేశం , ప్రచార సాధనాలు బీజేపీ పై చేసిన ప్రచారం, తెలుగు దేశం ఓడిపోవటంలో బీజేపీ పాత్ర ఉందని భావించటం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా తానా ఒక వర్గానికి కాపుకాసే సంఘం గా దీనితో మరొక్కసారి ముద్రపడింది.

ఇచ్చట వాహనములు నిలుప రాదు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

 

ఏ ఐ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ బ్యానర్స్ పై సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా దర్శన్ ఎస్ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ప్రేరణ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ నో పార్కింగ్ ట్యాగ్ లైన్ తో “ఇచ్చట వాహనములు నిలుప రాదు” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. “ఇచ్చట వాహనములు నిలుప రాదు” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.

 

 

Read More: భార్య కోరికను తీర్చబోయి.. ప్రాణాలు పోగుట్టుకున్న భర్త

మన స్టార్ హీరోల వీక్నెస్ పాయింట్స్ ఏంటో తెలుసా..

 

గత కొన్నేళ్ళు గా టాలివుడ్ హీరోల మార్కెట్ అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. స్టార్ హీరోలు అందరూ కూడా దాదాపు వంద కోట్ల వసూళ్లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతి హీరోకు ఏదో ఒక బలహీనత ఉంటుంది. వాటిని మేనేజ్ చేయడం వల్ల హీరోల బలహీనతలు పెద్దగా కనిపించకపోవచ్చు. సరిగ్గా గమనిస్తే ప్రతి హీరోలో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తాయి.

 

    • చిరంజీవి: లెంగ్తీ డైలాగులలో తడబాటు…
    • బాలయ్య: సరైన కామెడీ టైమింగ్ లేకపోవడం…
    • నాగార్జున: ఎమోషనల్ సీన్స్, పవర్ పవర్ ఫుల్ డైలాగ్స్, డాన్స్ లో వీక్…

 

Read More:
వామ్మో తేజస్వీ.. కమిట్మెంట్ అంటూ బెడ్‌పైనే..

 

  • వెంకటేష్: రౌద్రంగా నటించలేకపోవడం, డాన్స్ వెంకటేష్ కు ఉన్న మైనస్ పాయింట్స్…
  • పవన్ కళ్యాణ్ : ఎమోషనల్ సీన్స్, డాన్స్ లో వీక్…
  • మహేష్ బాబు : పవర్ ఫుల్ డైలాగ్స్ లో తడబాటు, డాన్స్ లో వీక్…
  • ఎన్టీఆర్ : రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ లో కొద్దిగా వీక్…
  • ప్రభాస్ : రొమాన్స్, ఎమోషన్ లో కొద్దిగా వీక్…
  • రామ్ చరణ్: కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ మైనస్…
  • అల్లు అర్జున్ : ఎమోషనల్ యాక్టింగ్ లో వీక్…
  • నాని : మాస్ రోల్స్ కి అంతగా సూట్ కాలేకపోవడం…

మాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియ చేసాము. మీకు ఏమైనా తెలిసిఉంటే కామెంట్ ద్వారా మాకు తెలపండి.

అచ్యుతాపురం మహిళల్లో వెలుగునింపిన బ్రాండిక్స్ కంపెనీ

ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రలోని విశాఖపట్నం శివారు అచ్యుతాపురం ప్రాముఖ్యాన్ని ప్రముఖంగా ప్రచురించింది. శ్రీలంక కు చెందిన ఒక బహుళజాతి కంపెనీ 2008 లో బ్రాండిక్స్ ఇండియా అప్పరెల్ సిటీ పేరుతో వెయ్యి ఎకరాల స్థలంలో స్త్రీల లోదుస్తుల ఫ్యాక్టరీని ప్రారంభించింది. ఇందులో విశేషమేమిటని అనుకోవచ్చు. ఒకటి దాదాపు 18 వేలమందిస్త్రీలకు ఉపాధి కల్పిస్తుంది. రెండు ఈ వూరు పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఎందుకంటే అది ఈ దుస్తులను సరఫరా చేసేది అల్లాటప్పా కంపెనీలకు కాదు. అమెరికాలో విక్టోరియా కంపెనీ ఈ రంగంలో హై ఎండ్ వెరైటీ కి ప్రసిద్ధిచెందింది. వాళ్లకు ఈదుస్తులు ఈ ఫ్యాక్టరీనుంచే రహస్యంగా వెళుతున్నాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. ఈ కంపెనీకి ప్రసిద్ధిచెందిన కాల్విన్ క్లిన్ , మార్క్ అండ్ స్పెన్సర్ కంపెనీలు కూడా క్లయింట్ లే. ప్రతినెలా అమెరికా, యూరప్ , జపాన్ కి ఇక్కడినుంచి ఈ లోదుస్తులు ఎగుమతి చేస్తున్నారు.

ఇందులో విశేషమేమిటంటే చుట్టుపక్కల 600 గ్రామాలనుంచి మహిళలు ఇందులో పనిచేస్తున్నారు. 200 బస్సులు వీళ్ళను తీసుకొచ్చి, తీసుకెళ్తాయి . ఈ పరిశ్రమ పెట్టిన కొత్తలో ఇందులో పనిచేసే మహిళలు ఈ రకం దుస్తులు కుట్టుతున్నామని చెప్పుకోవటానికి మొహమాటపడేవాళ్లు. ఎందుకంటే గ్రామీణవాతావరణం అలాంటిది. ప్యాంటు, షర్టులు కుడుతున్నట్లు చెప్పేవాళ్ళు. మెల్లి మెల్లిగా ఆ వాతావరణం తొలిగిపోయింది. ఈప్రాంతంలో ఇంతమంది మహిళల్ని స్వంత కాళ్ళమీద నిలబెట్టిన సంస్థ, వృత్తి ఇది. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపింది. సగటున 8 వేలనుంచి 15 వేల వరకు వీళ్లకు వస్తుంది. కనీసం ఏడో తరగతి చదివుంటే చాలు. కానీ ఇంటర్, అంతకన్నా పైన చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది బహుళజాతి కంపెనీ కాబట్టి కొన్ని కనీస సౌకర్యాలు కల్పించారు. మొత్తం మీద చూస్తే ఈ ప్రాంత మహిళల జీవితాల్లో ఈ ఫ్యాక్టరీ వెలుగులు నింపిందని చెప్పాలి.

మన తెలుగు మీడియా ఇటువంటి వార్తలను ఎందుకు ప్రచారం చేయవో తెలియదు. పనికిరాని చచ్చు కబుర్లతో ప్రజల బుర్రల్ని చెడగొట్టే బదులు ఇటువంటి గ్రోత్ స్టోరీలను ప్రచురిస్తే బాగుంటుంది. ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించటమే కాకుండా అందులో పనిచేసే వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ బతుకులు ఎలా మారాయో, దాని వలన వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడ్డాయో వివరంగా ప్రచురించినందుకు మరొక్కసారి టైమ్స్ ఆఫ్ ఇండియా కు సెల్యూట్.

వామ్మో తేజస్వీ.. కమిట్మెంట్ అంటూ బెడ్‌పైనే..

 

బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన తేజస్వీకి బుల్లితెరపై కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే అంతకు ముందు తెచ్చుకున్న బ్యాడ్ నేమ్‌తో ఏవీ సక్సెస్ కాలేకపోయాయి. అప్పటి వరకు వచ్చిన సినీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

 

ఇక ఈ అమ్మడి దృష్టి వెబ్‌సిరీస్‌లపై పడింది. అసలే అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని తేజస్వీ.. కమిట్మెంట్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ టైటిల్ వింటేనే కంటెంట్ ఏమై ఉంటుందా? అని అర్థమైపోతుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ను చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే.

 

Read More: మన స్టార్ హీరోల వీక్నెస్ పాయింట్స్ ఏంటో తెలుసా..

తెలుగుదేశం కాపు నాయకులు ఎటు?

 

తెలుగు దేశం పార్టీకి అన్ని వైపులనుంచీ కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు జగన్ చంద్రబాబునాయుడు గతంలో చేసిన తప్పులు, అవినీతి పనులపై భూతద్దంతో వెదికే పనిలో వున్నాడు. మరొకవైపు బీజేపీ డీలాపడిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గాలం వేసి వేటాడే పనిలో వుంది. చంద్రబాబునాయుడుకి కుడిభుజం, ఎడమభుజం అనుకున్న సుజనా చౌదరీ , సీఎం రమేష్ బీజేపీ లో చేరటం అందరికీ ఆశ్చర్యమేసింది. ఇందులో చంద్రబాబునాయుడు ప్రమేయం ఉందనీ, తనను తాను రక్షించుకునే పనిలో భాగంగానే వాళ్ళిద్దరినీ బీజేపీ లోకి తానే పంపించాడని జనం నమ్ముతున్నారు.

ఇంతలో తెలుగుదేశంలోని కాపు నాయకులంతా కాకినాడలో సమావేశమై చర్చించుకోవటం సంచలనమయ్యింది. బీజేపీ లో చేరతారని , జగన్ పార్టీ లో చేరతారని రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఇంతలో చంద్రబాబునాయుడు విదేశాలనుంచి తిరిగిరావటం , వాళ్లతో తిరిగి సంబంధాలు నెరపటం జరిగింది. ఇందులోభాగంగానే ఇటీవల కాపునేతలతో సమావేశం జరిగింది. అందులో ఏమిజరిగిందనేది ఇప్పటివరకు పూర్తి సమాచారం బయటకు రాలేదు. కాకపోతే చంద్రబాబు వాళ్ళను అన్నిరకాలుగా వెళ్లోద్దని ప్రాధేయపడ్డట్లు తెలిసింది. అయినా వాళ్ళ భవిష్యత్తు ప్లాన్ పూర్తిగా తెలియటంలేదు.

ఈ నాయకులు ఎలా ముందుకు పోవాలో తెలియక కొట్టుమిట్లాడుతున్నారని తెలిసింది. జగన్ పిలిచి పెద్దపీట వేస్తే గంపగుత్తగా దూకటానికి సిద్ధంగా వున్నారని తెలిసింది. అయితే జగన్ కి అంత పెద్దపీట వేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నట్లు కనిపించటం లేదు. తెరవెనుక బేరసారాలు కుదిరినట్లు లేదు. అలాగే రెండోవైపు బీజేపీ లో చేరటానికి కూడా సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. విశేషమేంటంటే జనసేన వైపునుంచి వీళ్ళను చేర్చుకోవటానికి ఎటువంటి ప్రయత్నమూ చేయటంలేదు. వీళ్లకూ ఆ ఆసక్తి ఉన్నట్లు లేదు. ఎందుకంటే ఇంకో అయిదు సంవత్సరాలు వీళ్ళు అధికారంలేకుండా ఉండాలంటే కష్టంగా వుంది. జగన్ కనుక పెద్దపీట వేయకపోతే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ లో చేరే అవకాశాలు మెండుగా వున్నాయి. ఒకటి స్పష్టం ఏమిటంటే తెలుగుదేశంలో ఎక్కువకాలం వుండరనేది. కాపులు దూరమయితే తెలుగుదేశం పని కష్టమే.

పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరుకావటంపై రాద్ధాంతం

 

పవన్ కళ్యాణ్ తానా మహాసభలకు హాజరు అవుతున్నట్లు తెలిసింది. దీనిపై వాళ్ళ అభిమానుల్లోనే చర్చ జరుగుతుంది. ఇంతవరకూ అమెరికా లోని పవన్ అభిమానుల్లో చాలామంది తానా సభ్యులు కాదు. కారణం వాళ్లలో చాలామందికి తానా ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తుందని నమ్ముతున్నారు. మరి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తానా మహాసభలకు హాజరు కావటం జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల మేరీల్యాండ్ లో ఆప్టా సభలు జరిగినప్పుడు అది ఒక కులానికి సంబంధించింది కాబట్టి హాజరు కావద్దని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందుకే హైదరాబాద్ నుంచి జనసేన నాయకులెవ్వరూ హాజరు కాలేదు. మరి ఈరోజు తానా సభలకు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా హాజరు కావటం ఆయన అభిమానుల్లో కొంతమందికి నచ్చటంలేదు.

తానా ఆప్టా లాగా ఒక కులస్తులకే సభ్యత్వం ఇవ్వకపోవటం నిజమే. అయితే తానా లో ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం వహిస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతమాత్రాన ఒక రాజకీయనాయకుడిగా తానా సభలకు వెళ్లటాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ప్రస్తుతం తనకు అంత ప్రాధాన్య అంశం కాదు. అభిమానుల్లో అపోహలు కలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. అలాగే ఆప్టా సభలను కూడా బాయికాట్ చేయాల్సిన పనిలేదు. రాజకీయనాయకులు ఎవరుపిలిచినా వెళ్లొచ్చు. కాకపోతే అక్కడ మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తానా సభలకు హాజరు కావటం ఆయన అభిమానుల్లో చర్చనీయాంశమయ్యింది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియ..రోల్ ఇదే..!

 

ఒకప్పుడు అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన శ్రియ‌.. పెళ్ళ‌య్యాక కాస్త జోరు త‌గ్గించింది. ఒక‌వైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు ఆచితూచి సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. తాజాగా మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

 

Read More:ఫొటోస్: అదిరిపోయిన RRR హీరోలు

 

ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో డైరెక్ట‌ర్ రాజ‌మౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, హిందీ ‘దృశ్యం’లో వీరిద్దరూ జంటగా నటించారు. మళ్లీ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం వికారాబాద్‌ అడవుల్లో అజయ్‌ దేవగణ్‌, శ్రియపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. శ్రియ‌కి.. `ఆర్ ఆర్ ఆర్` ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తుందో చూడాలి.

జగన్ తన కులస్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాడా?

 

సోషల్ మీడియా చాలా అలెర్ట్ గా ఉంటుంది. జగన్ నియామకాలపై ఇప్పటికే ఓ పెద్ద సంచలనం మొదలయ్యింది. ఇప్పటికి నామినేషన్ పోస్టుల్లో ఎక్కువమందిని రెడ్డి కులస్తులనే నియమించాడని పేర్లతో సహా హల్ చల్ చేస్తుంది. ఇదేగనుక నిజమయితే తెలుగుదేశం చేసిన తప్పే జగన్ కూడా చేస్తున్నట్లే. తెలుగు దేశం అన్ని కీలక పోస్టుల్లో కమ్మ వారినే నియమించటం తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకుంది. అదే తప్పు మరలా జగన్ చేస్తే ప్రజానీకం క్షమించరు. ఇప్పటికే ఎన్నో కీలక పదవులు రెడ్డి కులస్తులకు కట్టబెట్టాడని సోషల్ మీడియా లో పేర్లతో సహా హల్ చల్ చేస్తుంది. అది ఎంతవరకు నిజమో పాఠకులే చెప్పాలి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న లిస్టు ఇక్కడ ఇస్తున్నాం.

:

*రెడ్డి రాజులు మళ్ళీ వచ్చారు *

*వై ఎ‌స్ జగన్ మోహన్ రెడ్డి *

సీఎం అయిన 6 రోజులలో మూడు యూనివర్సిటీల రిజిస్ట్రార్లను మార్చారు.

🔺రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా శ్రీ సీవీ కృష్ణారెడ్డి

🔺ఎస్కేయూ రిజిస్ట్రార్ గా …
శ్రీ మల్లికార్జున్ రెడ్డి,

🔺ఎస్వీ రిజిస్ట్రార్ గా
శ్రీ శ్రీధర్ రెడ్డి

🔺ఇక ముఖ్యమంత్రి రెడ్డి

🔺ముఖ్యమంత్రి PA రెడ్డి

🔺ప్రభుత్వ సలహాదారు రెడ్డి

🔺పార్లమెంట్ లో పార్టీ నేత గా రెడ్డి

🔺రాజ్యసభ లో పార్టీ నేత గా రెడ్డి

🔺ఖాళీగా ఉన్న మూడు యూనివర్సిటీ లకు నియమించిన VC లు ముగ్గురు రెడ్లే

🔺ఒలింపిక్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రెడ్డి

🔺పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుడు రెడ్డి

🔺టీటీడీ ఛైర్మన్ గా రెడ్డి

🔹ఇంక మతం విషయానికి వస్తే

🔹ముఖ్యమంత్రి క్రిస్టియన్

🔹డీజీపీ క్రిస్టియన్

🔹ఇంటిలిజెన్స్ చీప్ క్రిస్టియన్

🔹చీప్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా క్రిస్టియన్

🔹పులివెందుల సీఎం క్యాంప్ ఆఫీస్ PA క్రిస్టిన్

🔸”ఇదింకా శాంపిలే”🔸

🔸 అసెంబ్లీ సమావేశాలయ్యాక నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది.

🔸 ఈ లోపే కొన్ని కీలకమైన పదవులన్నీభారీ స్థాయి బడ్జెట్ అధీ కారం ఉండే పదవులన్నీ నియామకం అయిపోతున్నాయి.

🔸కొత్త ప్రభుత్వం లో చాలా కీలకమైన చైర్మన్స్ మరియు పార్లమెంట్ లీడర్స్, సభలో పార్టీ లీడర్స్ ప్రస్తుతానికి ఎవరెవరున్నారో చూడండి.

🔸ఇదేమి కల్పితం కాదు. ప్రభుత్వ సమాచారమే. ఇందులో తప్పులు ఉంటే సవరించుకుంటా.

🔸ఏపీఐఐసీ చైర్మన్ – రోజా రెడ్డి

(పరిశ్రమలు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. చాలా ప్రాముఖ్యమైంది)

🔸టీటీడీ చైర్మన్ – వైవీ సుబ్బా రెడ్డి

(తిరుమల తిరుపతి దేవస్థానం )

🔸సీఆర్డీఏ చైర్మన్ – ఆళ్ల రామకృష్ణ రెడ్డి

🔸(రాజధాని పరిధి ప్రాంత అభివృద్ధి సంస్థ. వేల ఎకరాల భూమి పై అధికారం ఈ సంస్థ కి సొంతం )

🔸చీఫ్ విప్ – గడి కోట శ్రీకాంత్ రెడ్డి

🔸అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ క్యాబినెట్ హోదా

🔸తుడా చైర్మన్ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

🔸తిరుపతి నగర పరిధి అభివృద్ధి సంస్థ . చాలా బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం.

🔸ప్రభుత్వ సలహాదారు – సజ్జల రామకృష్ణ రెడ్డి

దీని గురించి చెప్పేదేముంది.

🔸ఆర్టీసీ విలీనం పై కమిటీ – ఆంజనేయ రెడ్డి .

🔸పార్లమెంటరీ పార్టీ లీడర్ – విజయ సాయి రెడ్డి

🔸లోక్ సభ పార్టీ లీడర్ – మిథున్ రెడ్డి

🔸వీటిలో కొన్నింటికి క్యాబినెట్ హోదా కూడా ఉంటుంది.

🔸ఇది శాంపిల్ ఇంకా ముందుంది..

🔸మంత్రి వర్గ కూర్పుని అభినందిస్తా. కానీ రానున్న రోజుల్లో జరగబోతున్నది ఏమిటో కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది.

🔸ఈ విషయాలన్నీ సామాజిక మాధ్యమాల ద్వారా అయినా ప్రచారం చేయండి.

🔸కనీసం రానున్న నియామకాల్లో అయినా ఇటువంటి ఏకపక్ష వైఖరి వీడతారేమో..

🔸అన్నట్టు దళితులకు పెద్ద పీట అనే వారు ఇంత భారీ స్థాయి నియామకాల్లో మన పీట ఎవరు ఎత్తుకెళ్లారో కాస్త చూడండి బ్రదర్స్.🔸

🙏🔸

Is this true ?

మంత్రివర్గంలో సామాజిక న్యాయం పాటించిన జగన్ కీలక పదవుల్లో తనవారిని ఎందుకు నియమించాడో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఆంధ్రా బీజేపీ అధ్యక్షుడుగా చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి పేరు మరలా వినిపిస్తోంది. ఆంధ్రా బీజేపీ లోని కాపు నాయకులు తన ఇంటిముందు క్యూ కడుతున్నారు. నిన్నఅంటే సోమవారం రాత్రి మరోసారి చిరంజీవి ఇంటికి వెళ్లి బీజేపీ లో చేరమని అడిగారని విశ్వసనీయంగా తెలుస్తుంది . తానుగనుక వచ్చేటట్లయితే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇందుకు చిరంజీవి స్పందన ఏంటో తెలియదు. కానీ అప్పుడే ఇది వైరల్ అయ్యింది.

చిరంజీవి గనుక ఒప్పుకొనేటట్లయితే ఆంధ్రా రాజకీయాలు రంజుగా ఉంటాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్ జనసేన తో వచ్చే అయిదు సంవత్సరాలు రాజకీయాల్లో వుండాలని పధకాలు రచిస్తుంటే రెండోవైపు చిరంజీవి కనుక బీజేపీ అధ్యక్షుడయితే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. చిరంజీవి కనుక తిరిగి రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన ను అన్నయ్య కోసం విలీనం చేస్తాడా? ఇది అందరి మనస్సుల్లో తొలుస్తున్న ప్రశ్న.

ఇకపోతే అసలు కాపు బీజేపీ నాయకుల ఈ ప్రయత్నం వెనుక సామజిక కోణం ఉందని అందరూ అనుకుంటున్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రా రాజకీయాలు చక చకా మారుతున్నాయి. అధికారం కోల్పోయిన ఒక సామాజిక వర్గం బీజేపీ ద్వారా తిరిగి అధికారానికి దగ్గరకావాలని ప్రయత్నం చేయటం అందరికీ తెలిసిందే. అయితే ఇది బీజేపీ లో ఎన్నికలకు ముందే చేరిన కాపు సామాజిక వర్గం నాయకులకు రుచించటం లేదు. తెలుగుదేశం పూర్తిగా కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యంలో ఉందనే వీళ్ళు బీజేపీ ని ఆశ్రయించారు. తిరిగి ఇక్కడా వాళ్ళే వచ్చి ఆధిపత్యం చెలాయించటం ఇష్టం లేకే చిరంజీవిని ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అందుకనే ఆంధ్రా రాజకీయాలు రంజుగా ఉన్నాయని అభివర్ణిస్తున్నారు. వాస్తవానికి ఇంకా అయిదు సంవత్సరాలు ఎన్నికలు లేవు. అయిదు సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరగొచ్చు. ఇంతముందుగా ఇప్పట్నుంచే ఈ రాజకీయ సమీకరణాలు కోకిల ముందే కూసినట్లుందని అనుకుంటున్నారు.

ABN రాధాకృష్ణ గారి వారాంతం చెత్తపలుకు

ఈయన ఏది మాట్లాడినా మనం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈయన ప్రతి వారం కొత్త కొత్త విషయాలను మనకు ఆవిష్కరిస్తుంటాడు . సామాన్యుడికి ఐతే ఇతను చెప్పే విషయాలు ఒక పట్టాన అర్ధంకావు. ఈమధ్య తెలుగు మాధ్యమాల్లో ఇలాంటి వారు చాలా మంది పుట్టుకొస్తున్నారు. ప్రధమంగా ఇలాంటి వారు, వారి గురుంచి వారు చాలా ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇతర ప్రచార సాధనాలు రానంత వరకు వీరి మీడియాలో ఏమి మాట్లాడితే , ఏది రాస్తే అదే ప్రవచనము అనుకోవాలి.

విషయానికి వస్తే ఈయన కొత్త చెత్త పలుకులో మనకు కొత్త విషయాన్ని ఆవిష్కరించాడు. అదేంటంటే కెసిఆర్ గారు హరీష్ రావు ను కొత్త పార్టీ పెట్టటానికి తానే వెనకనుండి తెరవెనక భాగోతమ్ నడిపిస్తున్నాడు అనే ఎవరికీ తెలియని దాన్ని ఈయన కనుక్కున్నాడు. ఇంకా ముందుకు వెళ్లి తమిళనాడులో DMK , AIADMK తరహాలో ఏదో ఒక పార్టీ వాళ్ళ కుటుంబం లోనే ఉండేటట్లు కెసిఆర్ వ్యూహమాట . ఈ కుహానా మేధావులు మొదట చేసే పని ఏమిటి అంటే ఆ విషయం నిజమయిన కాక పోయినా ముందర ఒక అనుమానపు బీజాన్ని ప్రజల మనస్సులో నాటాలి. ఈ రకంగా వీళ్లు ముందర వీళ్ళ పేపర్లు చదివే వాళ్లలో ఆసక్తిని రేకిస్తారు అదే సమయంలో వీరి ప్రతికూల పార్టీలో కొంత అనుమానాన్ని రేకిస్తారు.

ఇవన్నీ పాతకాలం నాటి విధానాలు RK గారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడు తున్నారో అందరికి తెలుసు. ప్రజలకు ఏదన్న ఉపయోగం ఉండే విషయాలు మాట్లాడితే బాగుంటదేమో ఆలోచించండి సారూ RK గారూ .

చదుకున్న ఆడవాళ్లు ఈసారి ట్రంప్ కొంప ముంచుతారా ?

అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు మరలా 2020 నవంబర్ లో ఉన్నాయి కానీ 2 సంవత్సరాల ముందు నుంచి ఈ ఎన్నికల హడావిడి మొదలవుతుంది . అమెరికా లో ప్రతి 4 సంవత్సరాలకు ప్రెసిడెంట్ ఎన్నికలు, ప్రతి 2 సంవత్సరాలకు కాంగ్రెస్, సెనెట్ ఎన్నికలు జరుగుతుంటాయి. అంటే ఎప్పుడూ ఎన్నికల హడావిడి ఉంటుంది అన్నమాట. 2016 లో ట్రంప్ గెలిచిన తర్వాత మరలా 2018 ఎన్నికల్లో ట్రంప్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి . కాంగ్రెస్ లో డెమొక్రాట్స్ , సెనెట్ లో రిపబ్లికన్స్ మెజారిటీ సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో సబర్బన్ మహిళలు చాలా మంది ట్రంప్ కు వ్యతిరేకంగా వోట్ చేసారు . ఇదే ట్రెండు కనుక కంటిన్యూ ఐతే 2020 ప్రెసిడెంట్ ఎన్నికలలో ఈ మహిళలు , మిల్లీనియల్స్ , పెళ్లి జరిగి విడాకులు తీసుకున్న మహిళలు వలన ప్రమాదం పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది . దీనికి కొసమెరుపుగా కొంతమంది వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతమున్న మైక్ పెన్స్ కు బదులు భారతీయ సంతతికి చెందిన నిక్కీ హెలీ పేరును పరిశీలించమని ప్రొపొస్ చేస్తున్నారు.