Homeజాతీయ వార్తలుచదుకున్న ఆడవాళ్లు ఈసారి ట్రంప్ కొంప ముంచుతారా ?

చదుకున్న ఆడవాళ్లు ఈసారి ట్రంప్ కొంప ముంచుతారా ?

అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు మరలా 2020 నవంబర్ లో ఉన్నాయి కానీ 2 సంవత్సరాల ముందు నుంచి ఈ ఎన్నికల హడావిడి మొదలవుతుంది . అమెరికా లో ప్రతి 4 సంవత్సరాలకు ప్రెసిడెంట్ ఎన్నికలు, ప్రతి 2 సంవత్సరాలకు కాంగ్రెస్, సెనెట్ ఎన్నికలు జరుగుతుంటాయి. అంటే ఎప్పుడూ ఎన్నికల హడావిడి ఉంటుంది అన్నమాట. 2016 లో ట్రంప్ గెలిచిన తర్వాత మరలా 2018 ఎన్నికల్లో ట్రంప్ కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి . కాంగ్రెస్ లో డెమొక్రాట్స్ , సెనెట్ లో రిపబ్లికన్స్ మెజారిటీ సాధించారు. కానీ 2018 ఎన్నికల్లో సబర్బన్ మహిళలు చాలా మంది ట్రంప్ కు వ్యతిరేకంగా వోట్ చేసారు . ఇదే ట్రెండు కనుక కంటిన్యూ ఐతే 2020 ప్రెసిడెంట్ ఎన్నికలలో ఈ మహిళలు , మిల్లీనియల్స్ , పెళ్లి జరిగి విడాకులు తీసుకున్న మహిళలు వలన ప్రమాదం పొంచి ఉన్నట్లు అనిపిస్తుంది . దీనికి కొసమెరుపుగా కొంతమంది వైస్ ప్రెసిడెంట్ గా ప్రస్తుతమున్న మైక్ పెన్స్ కు బదులు భారతీయ సంతతికి చెందిన నిక్కీ హెలీ పేరును పరిశీలించమని ప్రొపొస్ చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular